మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Cinema - Aug 09, 2020 , 19:03:20

స్టైల్ కు కేరాఫ్ ర‌జ‌నీకాంత్..నేటితో 45 ఏండ్లు

స్టైల్ కు కేరాఫ్ ర‌జ‌నీకాంత్..నేటితో 45 ఏండ్లు

సిల్వ‌ర్ స్క్రీన్‌పై ఆయ‌న క‌నిపిస్తే అభిమానుల‌కు పండ‌గే. ఆయ‌న న‌డక‌కు, స్టైల్ కు ఫిదా అవ్వాల్సిందే. డైలాగ్ చెప్తున్నాడంటే థియేట‌ర్ల‌లో ఈల‌లు వేయాల్సిందే. ఆ న‌టుడెవ‌రో మీకు ఇప్ప‌టికే అర్థ‌మై ఉంటుంది. మ‌న ఇండియ‌న్ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్. ప్రేక్ష‌కులు ఆయ‌నను త‌లైవా అని పిలుచుకుంటారు. ఈ సూప‌ర్ స్టార్ ఇండ‌స్ట్రీకి వ‌చ్చి 45 ఏండ్లు పూర్తి చేసుకున్నారు. క‌మ‌ల్‌హాస‌న్ తో క‌లిసి అపూర్వ రాగంగ‌ల్ సినిమాతో ఇదే రోజు సినీ ప‌రిశ్ర‌మ‌లో అడుగుపెట్టారు ర‌జినీ. ర‌జినీ 45 ఏండ్ల ప్ర‌స్థానాన్ని గుర్తు చేస్తూ కామ‌న్ డీపీని..సినీ స్టార్లు షేర్ చేసుకున్నారు.

మ‌ల‌యాళ స్టార్ మోహ‌న్ లాల్..ర‌జ‌నీ కెరీర్ లో చేసిన పాత్ర‌ల‌తో కూడిన పోస్ట‌ర్ ను షేర్ చేస్తూ..5 ద‌శాబ్దాలు..45 సంవ‌త్స‌రాలు..భార‌త సినిమాకు ఐకాన్‌, ఐడెంటిటీ. త‌న న‌ట‌నతో భార‌త సినీ ప‌రిశ్ర‌మ గొప్ప‌ద‌నాన్ని ప్ర‌పంచానికి చాటి చెప్పిన ర‌జ‌నీ సార్ కు శుభాకాంక్ష‌లు అని ట్వీట్ చేశారు. మ‌రో న‌టుడు పృథ్విరాజ్ సుకుమార‌న్..త‌మిళ‌, భార‌తీయ సినిమా ఐకాన్ ర‌‌జనీకాంత్ సార్ కు విషెస్ తెలియ‌జేస్తూ ట్వీట్ చేశాడు. లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo