ఆదివారం 25 అక్టోబర్ 2020
Cinema - Sep 09, 2020 , 19:01:29

షూటింగ్‌లో సూపర్‌స్టార్‌ మహేశ్‌

షూటింగ్‌లో సూపర్‌స్టార్‌ మహేశ్‌

కరోనా ప్రేరేపిత లాక్‌డౌన్‌తో సినిమా షూటింగ్‌లకు బ్రేక్‌ పడింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం అన్‌లాక్‌లో భాగంగా నిబంధనలు పాటిస్తూ చిత్రీకరణ చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. అయినా మహమ్మారి తీవ్రత తగ్గకపోవడంతో షూటింగ్‌లు జరగడం లేదు. సుదీర్ఘకాలం ఇంటికే పరిమితమైన సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు బుధవారం షూటింగ్‌లో పాల్గొన్నారు. అది సినిమా షూటింగ్‌ కాదు. కమర్షియల్‌ యాడ్‌ కోసం మొహానికి మళ్లీ మేకప్‌ వేసుకున్నాడు. ఈ సందర్భంగా షూటింగ్‌కు వచ్చిన మహేశ్‌ ఫొటోను శ్రేయాస్‌ గ్రూప్‌ తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్‌ చేసింది. యాడ్‌ షూటింగ్‌ను హైదరాబాద్‌లోనే రెండు రోజుల్లో పూర్తి చేయనున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం ప్రస్తుతం మహేశ్‌ బాబు పరశురామ్‌ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. మహేశ్‌కు జంటగా కీర్తి సురేష్‌ నటిస్తోంది. చిత్రీకరణ డిసెంబర్‌లో మొదలు కానున్నట్లు తెలుస్తోంది.logo