శనివారం 11 జూలై 2020
Cinema - Jun 29, 2020 , 19:33:55

ట్రాంపోలిన్ గేమ్ ఆడిన స‌న్నీలియోన్..వీడియో

ట్రాంపోలిన్ గేమ్ ఆడిన స‌న్నీలియోన్..వీడియో

త‌న ఫాలోవ‌ర్ల‌కు బోర్ కొట్ట‌కుండా సోష‌ల్ మీడియా ద్వారా వినోదాన్ని అందిస్తుంది అందాల తార స‌న్నీలియోన్. ఇప్ప‌టికే త‌న ఇంట్లో మాపింగ్ చేస్తూ డ్యాన్స్ చేసిన వీడియోను పోస్ట్ చేసింది. పిల్ల‌ల‌తో స‌ర‌దాగా ఆడుకుంటున్న ఫొటోలను షేర్ చేసింది. తాజాగా మ‌రోవీడియోతో నెటిజ‌న్ల‌ను అల‌రిస్తోంది స‌న్నీలియోన్. బ్లాక్ టీ ష‌ర్ట్, బ్లూ జీన్స్ లో ట్రాంపోలిన్ గేమ్ ఆడుతూ..గాల్లోకి ఎగురుతూ సంద‌డి చేసిన వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.

సూర్య‌కాంతి ద్వారా ఓ ఏంజెల్ నా భుజాల‌పైకి వ‌స్తోంది. అంటూ క్యాప్ష‌న్ ఇచ్చింది. ఈ వీడియో ఇపుడు నెట్టింట్లో అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది. ప్ర‌స్తుతం స‌న్నీలియోన్ త‌న ఫ్యామిలీతో క‌లిసి యూఎస్ లో ఉంది. స‌న్నీ ప్ర‌స్తుతం వీర‌మాదేవి, కోకా కోలా చిత్రాల్లో న‌టిస్తోంది. logo