తెలుగు, తమిళం, మలయాళ, కన్నడ, హిందీతోపాటు వివిధ భాషల ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు సన్నీలియోన్ (Sunny Leone). ఓ వైపు తన గ్లామర్ డోస్ తో అందరికీ నిద్రపట్టకుండా చేస్తూనే..మరోవైపు పర్ ఫార్మెన్స్ ఓరియెంటెడ్ పాత్రలు చేస్తూ బాలీవుడ్ (Bollywood) దర్శక నిర్మాతల చూపు తనవైపు తిప్పుకుంది. శారీ కట్టినా, మోడ్రన్ డ్రెస్ వేసినా, పొట్టి డ్రెస్ లో కనిపించినా ఆ కాస్ట్యూమ్స్ కే వన్నె తెస్తుందీ ఈ కెనడా సోయగం. ఎప్పటికపుడు అప్ డేట్ అవుతూ తన ఫాలోవర్ల అభిరుచులకు అనుగుణంగా ట్రెండీ వస్త్రధారణలో మెరుస్తుంటుంది సన్నీలియోన్.
ఈ భామ నెట్టింట్లో పెట్టే పోస్టులకు క్రేజ్ మామూలుగా ఉండదు. సన్నీలియోన్ ఫర్ ఫ్యూమ్ బ్రాండ్స్ లస్ట్ (Lust perfume), అఫెట్టోలను ప్రమోట్ చేస్తోంది. ఓ ప్రచార కార్యక్రమంలో సన్నీ సిల్వర్ కలర్ లాంగ్ స్ల్పిట్ గౌనులో మెరిసిపోయింది. సన్నీ నడుముపై చెయ్యి వేసి హోయలు పోతూ మెట్లపై నుంచి దిగుతుండగా అక్కడే ఉన్న కెమెరాలు క్లిక్ మనిపించాయి. స్పెషల్ అట్రాక్షన్ గా కనిపిస్తున్న సన్నీలియోన్ తాజా ఫొటోలు నెటిజన్లను కట్టిపడేస్తున్నాయి.
సన్నీ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. తెలుగు, హిందీ భాషల్లో వస్తోన్న కోకా కోలా, హెలెన్ చిత్రీకరణ దశలో ఉన్నాయి. తమిళంలో రెండు సినిమాలు, మలయాళం, కన్నడలో ఒక్కో సినిమాను లైన్ లో పెట్టింది సన్నీలియోన్.
ఇవికూడా చదవండి..
Bangarraju : బంగార్రాజు ఫస్ట్ లుక్ విడుదల చేసిన నాగ చైతన్య
Bigg Boss: పుకార్లకి ఈ పోస్టర్‌తో చెక్ పడ్డట్టేనా ?
Chiranjeevi| చిరంజీవిని కలిసేందుకు 12 రోజులు సైకిల్ యాత్ర