బాలీవుడ్ బ్యూటీ సన్నీ లియోన్ లీడ్ రోల్లో సినిమాలు చేస్తూనే అడపాదడపా స్పెషల్ సాంగ్స్‌లో నర్తిస్తుంది. సన్నీ కేవలం నార్త్‌కే పరిమితం కాకుండా సౌత్ ప్రేక్షకులకి దగ్గరైంది. మంచు మనోజ్ కరెంట్ తీగ
చిత్రంలో సన్నీ ఓ సన్నీ అంటూ సాగే పాటలో తన డ్యాన్స్ నెంబర్‌తో తెలుగు ప్రేక్షకులని ఎంతగా అలరించిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇక ఇప్పుడు మరాఠీలో కవ్వించేందుకు సిద్దమైంది. ఆమ్దార్ నివాస్
లో శాంతాబాయి
గా ప్రత్యేక గీతంలో ఆడిపాడనుంది.
సన్నీ నృత్యభంగిమలకు సంబంధించిన కొన్ని ఆన్ లొకేషన్ ఫోటోలు అంతర్జాలంలో సునామీలా పోటెత్తాయి. ఈ చిత్రంలో రియల్ ఎస్టేట్ ఏజెంట్ పాత్రలో రోహిత్ చౌదరి ప్రధాన పాత్రలో నటించారు. షియాజీ షిండే ఒక రాజకీయ నాయకుడిగా కనిపించనున్నారు. ఆ ఇద్దరూ సన్నీతో స్టెప్పులేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. శాంతాబాయి పాట కోసం.. సన్నీ లియోన్ మహారాష్ట్ర కోలి స్టైల్ వేషధారణలో పసుపు జాకెట్టు ధోతితో కనిపిస్తోంది.