బుధవారం 03 జూన్ 2020
Cinema - Apr 02, 2020 , 16:37:10

సన్నీలియోన్‌ ఆన్‌లైన్‌ చాట్‌ షో..

సన్నీలియోన్‌ ఆన్‌లైన్‌ చాట్‌ షో..

ముంబై: లాక్‌ డౌన్‌ ప్రభావంతో దేశవ్యాప్తంగా అన్ని రాష్ర్టాల్లో ప్రజలు ఇళ్లకే పరిమితమైన విషయం తెలిసిందే. కరోనాను తరిమికొట్టేందుకు ప్రజలతోపాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, సెలబ్రిటీలు క్వారంటైన్‌కు పరిమితమయ్యారు. అయితే క్వారంటైన్‌ టైంలో..అభిమానులకు దగ్గరయ్యేందుకు ప్లాన్‌ చేసింది సన్నీలియోన్‌. గురువారం నుంచి తాను ఆన్‌లైన్‌ చాట్‌ షోను ప్రారంభిస్తున్నానని సన్నీ ప్రకటించింంది.

యూట్యూబర్‌ అనిషా దీక్షిత్‌తో కలిసి లాక్‌డ్‌ అప్‌ విత్‌ సన్నీ పేరుతో డిజిటల్‌ చాట్‌షోను షురూ చేస్తున్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా వెల్లడించింది. ప్రతీ రోజు మధ్యాహ్నం సమయంలో తన అభిమానులు, ఫాలోవర్లతో వినోదాన్ని అందిస్తూ..సరదాగా సంభాషిస్తానని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ రంగాలకు చెందిన వారితో చాట్‌ చేసి..క్వారంటైన్‌ సమయంలో ఏం చేస్తున్నారో తెలుసుకుంటానని చెప్పింది సన్నీలియోన్‌. 


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo