శనివారం 27 ఫిబ్రవరి 2021
Cinema - Jan 26, 2021 , 15:02:57

సిక్సర్ బాదిన సన్నీ లియోన్‌

సిక్సర్ బాదిన సన్నీ లియోన్‌

ముంబై : డేటింగ్‌ రియాలిటీ షో స్పిట్ల్స్‌విల్లా షూటింగ్‌ కోసం కేరళలో ఉన్న  బాలీవుడ్‌ హాట్‌ భామ సన్నీ లియోన్‌ ఓ పార్క్‌లో క్రికెట్‌ ఆడుతున్న వీడయోను షేర్‌ చేసింది. ఈ వీడియోలో సన్నీ లియోన్‌ బ్యాట్‌ పట్టుకుని బంతిని దూరంగా కొడుతూ కనిపించింది. టీమిండియాలో చేరేందుకు సిద్ధంగా ఉన్నానంటూ నవ్వులు రువ్వింది.

భారత్‌లో ఇంగ్లండ్‌ జట్టు పర్యటించనున్న క్రమంలో ‘ ఇంగ్లండ్‌పై బరిలోకి దిగేందుకు కిట్‌ను సర్దుకోవాలా’ అంటూ చమత్కరించింది. ఇన్‌స్టాగ్రాంలో సన్నీ షేర్‌ చేసిన వీడియోకు నెటిజన్లు స్పందిస్తూ సిక్సర్‌ కొట్టావంటూ ఫైర్‌ ఎమోజీలను జతచేస్తూ కామెంట్స్‌ రాశారు. మిడిలార్డర్‌లో మీలాంటి డేంజరస్‌ బ్యాట్స్‌మెన్లు అవసరమని మరొకరు కామెంట్‌ చేయగా, నైస్‌ షాట్‌ అంటూ మరో నెటిజన్‌ రాసుకొచ్చారు. 


VIDEOS

logo