గురువారం 24 సెప్టెంబర్ 2020
Cinema - Aug 10, 2020 , 10:39:16

భ‌ర్త‌తో స‌న్నీ ప్రాంక్ .. వీడియో వైర‌ల్

భ‌ర్త‌తో స‌న్నీ ప్రాంక్ .. వీడియో వైర‌ల్

హాట్ బ్యూటీ స‌న్నీ లియోన్ కోవిడ్ ఎఫెక్ట్‌తో గ‌త కొద్ది రోజులుగా లాస్ ఏంజెల్స్‌లో ఉంటున్న విష‌యం తెలిసిందే. అక్క‌డ త‌న భ‌ర్త‌,పిల్ల‌ల‌తో హాలీడేటైంని ఎంజాయ్ చేస్తుంది. ఇక అభిమానుల‌కి ఎప్ప‌టిక‌ప్పుడు త‌న సోష‌ల్ మీడియా ద్వారా ట‌చ్‌లో ఉంటుంది. తాను చేసే యాక్టివిటీస్‌, ఫ‌న్నీ ఇన్సిడెంట్స్ ఇలా ప‌లు విష‌యాల‌ని త‌న ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తూ.. నెటిజ‌న్స్‌కి కావ‌ల‌సినంత వినోదాన్ని అందిస్తుంది.

తాజాగా స‌న్నీ లియోన్ త‌న భ‌ర్త‌ని ప్రాంక్ చేస్తూ ఓ వీడియో షేర్ చేసింది. ఈ వీడియో చూసి ప్ర‌తి ఒక్క‌రు ప‌గ‌ల‌బ‌డి న‌వ్వుతున్నారు. ఇందులో స‌న్నీ భర్త డానియల్ వెబర్ స్విమ్మింగ్ పూల్ దగ్గ‌ర ఆదమ‌రిచి నిద్ర పోతున్నాడు. స‌న్నీ ఓ బెలూన్‌లో వాట‌ర్ నింపి దానిని భ‌ర్త‌ కాళ్ళ మ‌ధ్య పెట్టి ప‌గ‌ల‌గొట్టింది. దీంతో ఉలిక్కి ప‌డిన డానియ‌ల్ అక్క‌డ నుండి లేచి ప‌రుగుపెట్టాడు . ఏం చేయమంటారు డానియల్ పై ప్రాంక్ చేయడం చాలా ఈజీ. అందుకు ఆయన నాకు సహకరించేలా నిద్ర పోయాడు. అందుకే ఇలా చేశాను. చాలా మంచి భర్త అంటూ తన భర్తపై పొగడ్తలు కురిపించింది.ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతున్న ఈ వీడియోకి నెటిజ‌న్స్ ప‌లు కామెంట్స్ చేస్తున్నారు.  
logo