సోమవారం 19 అక్టోబర్ 2020
Cinema - Sep 12, 2020 , 12:44:19

స‌న్నీలియోన్ కొత్త కారు చూశారా ?

స‌న్నీలియోన్ కొత్త కారు చూశారా ?

హైద‌రాబాద్‌: హాట్ స్టార్ స‌న్నీ లియోన్ కొత్త కారు కొన్న‌ది.  ఇట‌లీ కంపెనీ మ‌స‌రాటీకి చెందిన గిబ్లి కారును స‌న్నీ ఇటీవ‌ల కొనుగోలు చేసింది. మ‌స‌రాటీ కంపెనీకి చెందిన కార్లు ఇప్ప‌టికే స‌న్నీ ద‌గ్గ‌ర రెండు ఉన్నాయి.  అయితే కొత్త కారుతో దిగిన ఫోటోల‌ను స‌న్నీ త‌న ఇన్‌స్టాలో పోస్టు చేసింది. గిబ్లీ క‌న్నా ముందు మ‌స‌రాటీకి చెందిన క్వాట్రాపోర్ట్‌, గిబ్లీ నిరిసిమోలు ఉన్నాయి. లాస్ ఏంజిల్స్‌లో ఉన్న త‌న ఇంటికి ఈ కొత్త గిబ్లీ డెలివ‌రీ అయ్యింది. ఈ కారు ధ‌ర 1.31 కోట్లు.  వైట్ క‌ల‌ర్‌లో కొత్త గిబ్లీ కారు చాలా అట్రాక్టివ్‌గా ఉంది.  దీంట్లో 3.0 లీట‌ర్ ట్విన్ ట‌ర్బో వీ6 ఇంజిన్ ఉన్న‌ది. వంద కిలోమీట‌ర్ల వేగాన్ని కేవ‌లం 5.5 సెక‌న్ల‌లో ఇది అందుకుంటుంది. టాప్ స్పీడ్ 267 కేఎంపీహెచ్.  


logo