మంగళవారం 09 మార్చి 2021
Cinema - Jan 12, 2021 , 13:29:39

రామ్‌తో ప‌రిచయం ఎప్పుడు, ఎలా ఏర్ప‌డిందో చెప్పిన సునీత‌

రామ్‌తో ప‌రిచయం ఎప్పుడు, ఎలా ఏర్ప‌డిందో చెప్పిన సునీత‌

సింగ‌ర్ సునీత జ‌న‌వ‌రి 9న శంషాబాద్ సమీపంలోని అమ్మపల్లిలోని సీతారామచంద్ర స్వామి ఆలయంలో బిజినెస్‌మెన్ రామ్ వీర‌ప‌నేని రెండో వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. వీరి వివాహానికి దిల్ రాజు, నితిన్, కోన వెంక‌ట్ త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు. అట్ట‌హాసంగా జ‌రిగిన ఈ పెళ్ళికి సంబంధించిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్ చ‌ల్ చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే త‌న పెళ్లి వేడుక‌ను స్వ‌ర్గంతో పోల్చిన సునీత నూత‌న జీవితం ప్రారంభించ‌డం సంతోషంగా ఉంద‌ని పేర్కొన్నారు.

రామ్‌తో సునీత‌కు ఎప్పుడు ఎలా ప‌రిచ‌యం ఏర్ప‌డింద‌నే అనుమానం అంద‌రిలో ఉంది. దీనిపై ఆంగ్ల‌మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూ ద్వారా క్లారిటీ ఇచ్చింది. రామ్‌తో ప‌రిచ‌యం నాకు చాన్నాళ్లుగా ఉంది. నా సోష‌ల్ మీడియా అకౌంట్స్ అన్ని అత‌నే చూసేవాడు. ఈ క్ర‌మంలో మా ఇద్ద‌రి మ‌ధ్య ప‌రిచ‌యం స్నేహంగా మారింది. ఇది కొన్నాళ్ళ‌కు మ‌రింత బ‌ల‌ప‌డి పెళ్ళి వ‌ర‌కు వెళ్ళేలా చేసింది. మేమిద్ద‌రం పెళ్లి చేసుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నాక ఈ విష‌యాన్ని ఇరు కుటుంబాల పెద్ద‌ల‌కు చెప్పాం. వారి అంగీకారంతోనే ఈ పెళ్లి చేసుకున్నాం. నా పిల్లలు కూడా పరిస్థితుల‌ని అర్ధం చేసుకొని రెండో పెళ్ళికి ఓకే చెప్పారు. 

నా కుటుంబం నాకు చాలా అండ‌గా నిల‌బ‌డింది. ఇంత బాగా అర్ధం చేసుకునే పిల్ల‌లు నాకు దొర‌క‌డం నా అదృష్టం. క‌రోనా వ‌ల‌న అంద‌రిని పిల‌వ‌లేక‌పోయాం. అప్ప‌టికీ 200 మంది అతిథులు హాజ‌ర‌య్యారు. రిసెప్ష‌న్ లాంటి కార్య‌క్ర‌మాలు కాకుండా స‌న్నిహితుల‌కు చిన్న చిన్న పార్టీలు ఇచ్చి ఆ త‌ర్వాత హ‌నీమూన్ ప్లాన్ చేసుకుంటాం అని సునీత పేర్కొంది. 19 ఏళ్ళ వ‌య‌స్సులోనే పెళ్లి చేసుకున్న సునీత విభేదాల వ‌ల‌న కొన్నాళ్ళ‌కే విడాకులు ఇచ్చింది. ఆమెకు ఆకాశ్ గోప‌రాజు అనే కొడుకు, శ్రియ గోప‌రాజు అనే కూతురు ఉన్నారు.

VIDEOS

logo