మంగళవారం 02 జూన్ 2020
Cinema - Feb 28, 2020 , 11:03:40

విల‌న్‌గా సునీల్‌.. ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

విల‌న్‌గా సునీల్‌.. ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

న‌టుడిగా కెరీర్ ప్రారంభించిన సునీల్ ఆ త‌ర్వాత క‌మెడీయ‌న్‌గా అల‌రించాడు. హీరోగాను త‌న‌దైన శైలిలో మెప్పించాడు. ఇటీవ‌ల మ‌ళ్లీ క‌మెడీయ‌న్‌గా సినిమాలలో న‌టిస్తున్న సునీల్ తొలిసారి విల‌న్ పాత్ర‌లో న‌టించేందుకు సిద్ధ‌మైన‌ట్టు తెలుస్తుంది. వివ‌రాల‌లోకి వెళితే  ‘హృదయ కాలేయం’, ‘కొబ్బరి మట్ట’ లాంటి స్పూఫ్‌ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న అమృత ప్రొడక్షన్స్   ‘కలర్ ఫోటో’ అనే సినిమా రూపొందిస్తుంది . ఈ సినిమాతో కమెడియన్ సుహాస్ హీరోగా పరిచయం కాబోతున్నాడు.  తెలుగుమ్మాయి చాందిని చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది. ఇందులో సునీల్ ఎస్ రామ‌రాజు పాత్ర‌లో త‌న విల‌నిజాన్ని పండించ‌నున్నాడ‌ట‌. ఈ రోజు సునీల్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా క‌ల‌ర్ ఫోటో చిత్రం నుండి సునీల్ లుక్ విడుద‌లైంది. ఇందులో సునీల్ చాలా ఆవేశంతో క‌నిపిస్తున్నాడు.

 ‘ఛాయ్ బిస్కెట్’ ఛానెల్‌తో పాపులర్ అయిన సుహాస్ ఆ తరవాత సినిమాల్లోకి అడుగుపెట్టాడు. ఈ మధ్య కాలంలో ‘మజిలీ’, ‘డియర్ కామ్రేడ్’, ‘ప్రతిరోజూ పండగే’ వంటి చిత్రాల్లో తనదైన కామెడీతో ఆకట్టుకున్నాడు. ఇప్పుడు ‘కలర్ ఫోటో’ సినిమాతో హీరోగా పరిచయం కాబోతున్నాడు. యూట్యూబ్‌లో పాపులర్ అయిన సందీప్ రాజ్ ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ‘మత్తు వదలరా’ సినిమాతో సక్సెస్ అందుకున్న యం.యం.కీరవాణి కుమారుడు కాలభైరవ ఈ సినిమాకు స్వరాలు సమకూరుస్తున్నారు. కామెడీ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ చిత్రం 1995లో ఒక ఇంజనీరింగ్ కాలేజీలో జరిగే ప్రేమకథగా రూపొందుతుంది.  


logo