‘తాను నమ్మిన సిద్ధాంతాల కోసం ఎలాంటి పోరాటానికైనా సిద్ధపడుతుంటాడు మహమ్మద్ ఖయ్యుమ్. నీతి, నిజాయితీలకు విలువనిచ్చే అతడు నిజాన్ని గెలిపించడానికి ఎలాంటి యుద్ధం చేశాడో తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే’ అంటున్నారు గరుడవేగ అంజి. ఆయన దర్శకత్వం వహిస్తూ ఛాయాగ్రహణాన్ని అందిస్తున్న చిత్రం ‘బుజ్జీ ఇలా రా’. సునీల్, ధన్‌రాజ్ కీలక పాత్రధారులు. అగ్రహారం నాగిరెడ్డి, సంజీవరెడ్డి నిర్మిస్తున్నారు. దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి కథ, స్క్రీన్‌ప్లేను సమకూర్చుతున్నారు. ఆదివారం సునీల్ లుక్‌ను చిత్రబృందం విడుదలచేసింది. ఇందులో మహమ్మద్ ఖయ్యుమ్ అనే ముస్లిం వ్యక్తిగా ఆయన కనిపిస్తున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ ‘సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రమిది. కేశవ్నాయుడు అనే పోలీస్ అధికారితో ఖయ్యుమ్కు ఉన్న వైరమేమిటన్నది ఆకట్టుకుంటుంది’ అని తెలిపారు. చాందిని తమిళరాసన్, పోసాని కృష్ణమురళి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ఎడిటర్: ఛోటా కె ప్రసాద్, సంగీతం: సాయికార్తిక్.