e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 21, 2021
Home News అనాథ పిల్ల‌ల‌కు అండ‌గా సందీప్ కిష‌న్..!

అనాథ పిల్ల‌ల‌కు అండ‌గా సందీప్ కిష‌న్..!

అనాథ పిల్ల‌ల‌కు అండ‌గా సందీప్ కిష‌న్..!

ప్ర‌స్తుతం ప్ర‌పంచం మొత్తం క‌రోనాతో వ‌ణికిపోతుంది. ఎప్పుడు ఎవరికి ఏం జ‌రుగుతుందో తెలియ‌ని పరిస్థితి. ఇలాంటి ప‌రిస్థితుల‌లో ఒక‌రికి ఒక‌రం చేయూత‌గా ఉండ‌డం చాలా ముఖ్యం. సినీ సెల‌బ్రిటీలు త‌మ వంతు బాధ్య‌త‌గా ఆక్సిజన్‌, వెంటిలేటర్లు, ఇంజక్షన్ల సమాచారం ఎప్పటికప్పుడు అందిస్తూ.. కరోనాతో బాధపడుతున్న వారికి అండగా నిలబడుతున్నారు. యువ హీరో సందీప్ కిష‌న్ తాను అనాథ పిల్ల‌ల‌కు అండ‌గానుంటాన‌ని ట్వీట్ చేసి అంద‌రి మ‌న‌సులు గెలుచుకున్నాడు.

క‌రోనా కార‌ణంగా త‌మ త‌ల్లిదండ్రుల‌ను కోల్పోయిన చిన్నారుల బాధ్య‌త‌ను తాను తీసుకుంటాన‌ని అన్నాడు సందీప్ కిష‌న్. మీ చుట్టుప‌క్క‌ల తల్లిదండ్రులు కోల్పోయి అనాథలుగా మారిన పిల్లలు ఉంటే వారి వివరాలను [email protected] కు తెలియజేయండి. క‌ష్ట‌కాలంలో కోవిడ్ కార‌ణంగా చిన్నారులు త‌మ త‌ల్లిదండ్రుల‌ను కోల్పోయి అనాథ‌లుగా మిగిలితే వారి బాధ్య‌త‌ల‌ను నేను, నా టీమ్ చూసుకుంటాం. రెండు సంవ‌త్స‌రాల పాటు వారికి కావ‌ల‌సిన తిండి, చ‌దవు, ఇతర అవ‌స‌రాలన్ని స‌మ‌కూర్చుతాం. ఇలాంటి స‌మ‌యంలో ఒకిరికి ఒక‌రం అండ‌గా నిల‌బ‌డాలి. ఇంటి దగ్గరే ఉండి, క్షేమంగా మీ ప్రాణాలను కాపాడుకోండి. కుదిరితే కొంత సాయం చేయండి అని సందీప్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి..

04.05.2021, మంగళవారం మీ రాశిఫలాలు
Lychee : హైద‌రాబాద్‌లో ఎక్క‌డ చూసినా ఇవే పండ్లు? వీటి స్పెష‌ల్ ఏంటి ?
భగ్గుమన్న బెంగాల్‌
రిటర్నింగ్‌ అధికారికి ప్రాణభయం
ఒక్క సీటీస్కాన్‌ 400 ఎక్స్‌రేలతో సమానం
లాక్‌డౌన్‌ అంశాన్ని పరిశీలించండి!
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
అనాథ పిల్ల‌ల‌కు అండ‌గా సందీప్ కిష‌న్..!

ట్రెండింగ్‌

Advertisement