కొందరు హీరోలు అంతే. ఇండస్ట్రీలో ఎన్ని సంవత్సరాలు ఉన్నా వాళ్లకు మాత్రం విజయం రాదు. ఎన్ని సినిమాలు చేసినా కాలం కలిసి రాదు. కొన్నిసార్లు మంచి సినిమాలు చేసినా.. విడుదలైన సమయం తప్పుగా ఉండటంతో అవి కూడా పెద్దగా అంచనాలు అందుకోవు. అలాంటి హీరోల్లో సందీప్ కిషన్ ముందుంటాడు. నిజానికి ఆయన నటించిన సినిమాలలో చాలా వరకు మంచి కంటెంట్ ఉంటుంది. కానీ అది బాక్సాఫీస్ దగ్గర మాత్రం కలెక్షన్స్ రూపంలో కనిపించదు. ఇప్పుడు సందీప్ కిషన్ తాజా చిత్రం విషయంలోనూ అదే రిపీట్ అవుతుంది.తాజాగా సందీప్ కిషన్ నటించిన గల్లీ రౌడీ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీనికి ఊహించిన టాక్ రాలేదు. అక్కడక్కడా నవ్వుకునే సీన్స్ ఉన్నాయి తప్ప సినిమా అంతా చూస్తే మాత్రం ఆసక్తికరంగా అనిపించలేదు అంటూ పెదవి విరుస్తున్నారు ప్రేక్షకులు. ప్రముఖ రచయిత కోన వెంకట్ ఈ సినిమాకు స్క్రీన్ ప్లే అందించాడు. సెప్టెంబర్ 17 న విడుదలైన ఈ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుంది. దీంతో మరోసారి సందీప్ కిషన్ ఆశలు అడియాశలు అయ్యేలా కనిపిస్తున్నాయి.
తెలుగు ఇండస్ట్రీలో దాదాపు 12 ఏళ్లుగా ఉన్నాడు సందీప్ కిషన్. ఇన్నేళ్లలో 25 సినిమాలు చేశాడు. మధ్యలో వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ లాంటి విజయాలు కూడా అందుకున్నాడు. అయితే ఈ హీరోకు ఇప్పటి వరకు కోరుకున్న గుర్తింపు మాత్రం రాలేదు. చేయాల్సిన ప్రయోగాలు చాలానే చేశాడు సందీప్. కానీ ఏం చేస్తాం టైమ్ బ్యాడ్.. అందుకే బ్లాక్‌బస్టర్స్ లేవు. కానీ పాన్ ఇండియన్ స్థాయిలో ఈయనకు గుర్తింపు మాత్రం ఉంది. హిందీ, తమిళంలోనూ సినిమాలు చేశాడు సందీప్ కిషన్. అక్కడా ఇక్కడా డైరెక్ట్ సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తమిళంలో ఒకట్రెండు విజయాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు వరస విజయాలతో దూసుకుపోతున్న లోకేష్ కనకరాజ్.. మొదటి సినిమా మా నగరం సినిమా చేసింది సందీప్ కిషన్‌తోనే. అయితే తెలుగులో మాత్రం సందీప్ కోరుకున్న మార్కెట్ రాలేదు. ఇలాంటి సమయంలో ఈయన కెరీర్‌కు రెండు మేజర్ టర్నింగ్ పాయింట్స్ వచ్చేలా కనిపిస్తున్నాయి. ఒకేసారి రెండు భారీ ప్రాజెక్టులతో వచ్చేస్తున్నాడు సందీప్. అందులో ఒకటి ఫ్యామిలీమ్యాన్ 3. రాజ్ డీకే దర్శక ద్వయం తెరకెక్కిస్తున్న ఈ వెబ్ సిరీస్‌పై అంచనాలు భారీగా ఉన్నాయి.
ఇప్పటికే తొలి రెండు సీజన్స్ హిట్టయ్యాయి. మూడో సీజన్ ఇండో చైనా చుట్టూ అల్లుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇందులో సందీప్ కిషన్ పెద్ద పాత్రే చేయబోతున్నాడు. మరోవైపు ఈయన హీరోగా ఏసియన్ ఫిల్మ్స్ సునీల్ నారంగ్ నిర్మాణంలో మైఖెల్ సినిమా వస్తుంది. ఇది పాన్ ఇండియన్ సినిమా. ఒకేసారి తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడంలో తెరకెక్కుతుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదలైందిప్పుడు. భారీ బడ్జెట్ తోనే మైఖెల్ సినిమాను తెరకెక్కిస్తున్నారు నిర్మాతలు. అటు ఫ్యామిలీ మ్యాన్ 3.. ఇటు మైఖెల్ సినిమాలతో పాన్ ఇండియన్ దండయాత్ర మొదలు పెట్టాడు సందీప్ కిషన్. మరి ఇది ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Lobo: లోబో, ఉమా దేవిల మధ్య లవ్ ట్రాకా.. ఏం జరుగుతుంది?
అఖిల్ కోసం మళ్లీ ఆ పని చేస్తున్న పూజా హెగ్డే..
సమంత ఊసెత్తితే నో ఇంటర్వ్యూ.. నాగచైతన్య కొత్త రూల్ !
బిగ్ బాస్ వేదికగా షణ్ముఖ్‌పై తన ప్రేమను వ్యక్తపరిచిన దీప్తి
Maestro Review: మాస్ట్రో రివ్యూ.. ఆకట్టుకున్న క్రైమ్ థ్రిల్లర్
Bigg Boss: బిగ్ బాస్‌లోకి అడుగుపెట్టను, ఎవరికి సపోర్ట్ చేయనన్న హాట్ యాంకర్