కమెడియన్ సత్య హీరోగా నటించిన చిత్రం ‘వివాహ భోజనంబు’. ఈ నెల 27న ‘సోనిలివ్’ ఓటీటీలో ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో కేఎస్ శినీష్తో కలిసి కథానాయకుడు సందీప్ కిషన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. తెలుగులో కొత్త ఓటీటీ వేదికగా ప్రారంభమవుతున్న సోని లివ్ తన తొలి తెలుగు చిత్రంగా ‘వివాహ భోజనంబు’ను స్ట్రీమింగ్ చేయనుంది. కరోనా సమయంలో పెళ్లి చేసుకున్న ఓ పిసినారి యువకుడి కథగా పూర్తి వినోదాత్మకంగా చిత్రాన్ని తెరకెక్కించామని చిత్రబృందం తెలియజేసింది.