రియాన్ష్, నిత్యాశెట్టి, చిచా బోనాల, అనన్య, మనోహర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘సండే స్పెషల్’. అనూప్ చక్రవర్తి దర్శకుడు. రామకృష్ణ బలుసు, జ్యోతి బాజినేని నిర్మాతలు. త్వరలో ట్రైలర్‌ను విడుదల చేయబోతున్నారు. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘వినోదం, థ్రిల్లింగ్ అంశాలు ప్రధానంగా సాగే చిత్రమిది. ఆద్యంతం హాస్యాన్ని పంచుతుంది. యువతరాన్ని ఆకట్టుకునే అన్ని అంశాలుంటాయి. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి’ అన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: అభి పెయ్యాల, సంగీతం: శేఖర్‌చంద్ర, రచన-దర్శకత్వం: అనూప్చక్రవర్తి బాజినేని.