లెజెండ్ దాదాసాహెబ్ఫాల్కే 2021 పురస్కారాల ప్రదానోత్స వేడుక ఆదివారం ముంబయిలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకలో దక్షిణాది చిత్రసీమకు చేసిన సేవలకు గాను సీనియర్ హీరో సుమన్‌కు లెజెండ్ దాదాసాహెబ్ఫాల్కే అవార్డును ప్రదానం చేశారు. దాదాసాహెబ్ఫాల్కే మనవడు చంద్రశేఖర్ ఈ అవార్డును సుమన్‌కు అందజేశారు. ప్రతిష్టాత్మకమైన ఈ పురస్కారాన్ని అందుకోవడం పట్ల సుమన్ ఆనందాన్ని వ్యక్తంచేశారు.