గురువారం 04 జూన్ 2020
Cinema - May 02, 2020 , 09:00:00

పని మ‌నిషి జీతంలో సగం ఇవ్వ‌మ‌ని కోరిన సుమ‌

పని మ‌నిషి జీతంలో సగం ఇవ్వ‌మ‌ని కోరిన సుమ‌

ఎప్పుడు ప‌లు షోస్‌తో బిజీ బిజీగా ఉండే సుమ ఇప్పుడు లాక్‌డౌన్ వ‌ల‌న ఇంటికే ప‌రిమిత‌మైంది. ఈ క్ర‌మంలో సోష‌ల్ మీడియాలో త‌ర‌చూ ప‌లు వీడియోస్ షేర్ చేస్తూ నెటిజ‌న్స్‌ని అల‌రిస్తుంది. ఆ మ‌ధ్య యాంక‌ర్స్‌తో క‌లిసి ఫ‌న్నీ వీడియో చేసిన సుమ తాజాగా త‌న ప‌నిమనిషితో క‌లిసి కొంత కామెడీ చేసింది. ఈ వీడియో సోష‌ల్ మీడియాలో తెగ చ‌క్క‌ర్లు కొడుతుంది. 

మేడే సంద‌ర్భంగా ఈ క‌ష్ట కాలంలోను ప‌ని చేస్తున్న కార్మికుల అంద‌రికి శుభాకాంక్ష‌లు తెలియ‌జేసింది. ఒక్క రూపాయి జీతం తీసుకోకుండా ఇంట్లో ప‌ని చేస్తున్న ఆడ‌వాళ్ళ‌కి అంటే.. అమ్మలకు.. అక్కలకు.. భార్యలకు, పిన్నులు అందరికీ కూడా మేడే విషెస్ చెప్పింది సుమ. వాళ్లున్నారు కాబట్టే మనం హాయిగా ఉన్నామని తెలిపింది ఈమె. ఇక త‌న ఇంట్లో ప‌ని చేస్తున్న మ‌హి అనే ప‌ని మ‌నిషిని ప‌రిచ‌యం చేస్తూ.. ఆమె ఉంది కాబట్టే తను షూటింగ్స్ ఉన్నపుడు ఏ టెన్షన్ లేకుండా ఉన్నానని చెప్పింది. ఇప్పుడు లాక్ డౌన్ కావడంతో ఇద్దరం కలిసి పని చేస్తున్నాం. మ‌రి నీ జీతంలో సగం నాకిస్తావా అంటూ మ‌హితో కామెడీ కూడా చేసింది సుమ‌. 
logo