శుక్రవారం 04 డిసెంబర్ 2020
Cinema - Oct 29, 2020 , 09:52:55

సుల్తాన్ ద‌ర్శ‌కుడి వివాహం.. శుభాకాంక్ష‌లు చెప్పిన కార్తి

సుల్తాన్ ద‌ర్శ‌కుడి వివాహం.. శుభాకాంక్ష‌లు చెప్పిన కార్తి

కార్తి ప్ర‌ధాన పాత్ర‌లో సుల్తాన్ అనే చిత్రం తెర‌కెక్క‌నుండ‌గా, ఈ చిత్రానికి సంబంధించిన ఫ‌స్ట్ లుక్ ఇటీవ‌ల విడుదైలంది. ఈ చిత్రాన్ని బ‌క్కియ‌రాజ్ క‌న్న‌న్ తెర‌కెక్కిస్తున్నాడు. ఈ ద‌ర్శ‌కుడి వివాహం రీసెంట్‌గా లూర్‌లోని సెవూర్‌లో ఆశ అనే అమ్మాయితో ఘ‌నంగా జ‌రిగింది. ఈ వేడుక‌లో శివ‌కార్తికేయ‌న్‌తో పాటు సుల్తాన్’ నిర్మాత ఎస్.ఆర్. ప్రభు, చిత్ర యూనిట్ పాల్గొన్నారు. సుల్తాన్ చిత్ర బృందం కార్తీ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ను వివాహ వేదిక‌పై ఆవిష్క‌రించి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. 

నూత‌న వ‌ధూవ‌రుల‌కు సుల్తాన్ హీరో కార్తీ త‌న ట్విట్ట‌ర్ ద్వారా శుభాకాంక్ష‌లు అందించారు. బ‌క్కియ‌రాజ్‌, ఆశ‌ల జీవితం ఆనందంగా ఉండాల‌ని మ‌న‌సారా కోరుకుంటున్నాను. ఒక‌రిపై ఒక‌రికి న‌మ్మ‌కం, అర్ధం చేసుకోవ‌డం ఉండాల‌ని కోరుకుంటున్నాను అని కార్తీ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. కాగా, రాజా రాణీ చిత్రంతో అసోసియేట్‌గా ప‌ని చేసిన బ‌క్కియ‌రాజ్ రెమోతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయ్యారు.  సుల్తాన్ అతనికి రెండో సినిమా. 

తాజావార్తలు