గురువారం 04 జూన్ 2020
Cinema - May 22, 2020 , 10:59:13

14 కోట్ల డీల్‌కి నో చెప్పిన ఉప్పెన టీం

14 కోట్ల డీల్‌కి నో చెప్పిన ఉప్పెన టీం

లాక్‌డౌన్ దెబ్బ‌కి సినిమాల‌న్నీ ఓటీటీల బాట ప‌ట్టాయి. ఇప్ప‌ట్లో థియేట‌ర్స్ ఓపెన్ అయ్యే ప‌రిస్థితి లేక‌పోవ‌డంతో చాలా సినిమాలు స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాంస్ వైపు దృష్టి సారిస్తున్నాయి. మెగా హీరో వైష్ణ‌వ్ తేజ్ హీరోగా తెర‌కెక్కిన ఉప్పెన చిత్రాన్ని కూడా ఓటీటీలో విడుద‌ల చేయాల‌ని నిర్మాత‌లు భావించారు. కాని డీల్ కుద‌ర‌క‌పోవ‌డంతో వెన‌క్కి తగ్గిన‌ట్టు తెలుస్తుంది.

మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఉప్పెన చిత్రాన్ని నిర్మించారు. దాదాపు 18 కోట్ల బ‌డ్జెట్‌తో ఈ చిత్రాన్ని బుచ్చిబాబు స‌న తెర‌కెక్కించిన‌ట్టు తెలుస్తుండ‌గా, ఓటీటీ వారు చిత్రానికి రూ. 14 కోట్ల ఆఫ‌ర్ ఇచ్చార‌ని అంటున్నారు. ఈ నేప‌థ్యంలో నిర్మాత‌లు సున్నితంగా తిర‌స్క‌రించిన‌ట్టు స‌మాచారం.  కృతి శెట్టి క‌థానాయిక‌గా న‌టించిన ఈ చిత్రంలో విజ‌య్ సేతుప‌తి ముఖ్య పాత్ర పోషించాడు. దేవి సంగీతం అందించాడు. ఏప్రిల్‌లో విడుద‌ల కావ‌ల‌సిన ఈ సినిమా లాక్‌డౌన్ వ‌ల‌న వాయిదా ప‌డిన విష‌యం తెలిసిందే. 


logo