ఆదివారం 17 జనవరి 2021
Cinema - Nov 28, 2020 , 15:51:24

ఖరీదైన విల్లా కొనుగోలు చేసిన సుకుమార్.. ఎక్కడో తెలుసా..?

ఖరీదైన విల్లా కొనుగోలు చేసిన సుకుమార్.. ఎక్కడో తెలుసా..?

తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం రాజమౌళి, త్రివిక్రమ్ తర్వాత ఆ స్థాయిలో డిమాండ్ ఉన్న దర్శకుడు సుకుమార్. రంగస్థలంకు ముందు ఈయన సినిమాలపై క్రేజ్ ఉండేది కానీ మరీ 100 కోట్ల రేంజ్ అయితే ఉండేది కాదు. కానీ ఒకే ఒక్క సినిమాతో ఈయన మార్కెట్ స్థాయి అమాంతం పెరిగిపోయింది. ఒక్కసారిగా 150 కోట్ల మార్కెట్ వచ్చేసింది. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా వస్తుంది. అల్లు అర్జున్ హీరోగా వస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశంలో ఉన్నాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు సుకుమార్ హైదరాబాద్ లోని కొండాపూర్ ఏరియాలో ఖరీదైన విల్లా తీసుకున్నాడని ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే గృహప్రవేశం కూడా చేసాడు ఈయన. దీనికి అతడికి అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారని.. అందులో అల్లు అర్జున్ కూడా ఉన్నాడని తెలుస్తుంది. 

రంగస్థలం తర్వాత ఒక్కో సినిమాకు ఈయన 15 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతుంది. దాంతో పాటు లాభాల్లోనూ వాటాలు తీసుకుంటున్నాడు సుకుమార్. ఈ లెక్కన సినిమాకు 20 కోట్ల వరకు అందుకుంటున్నట్లు తెలుస్తుంది. పుష్పకు ఈయన 20 కోట్లకు పైగానే అందుకుంటున్నాడు. ఇదిలా ఉంటే చాలా రోజులుగా హైదరాబాద్ లో ఓ మంచి విల్లా తీసుకోవాలని చూస్తున్న సుకుమార్.. ఇప్పుడు అనుకున్న పని పూర్తి చేసాడు. ఈ మధ్యే తన కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో గృహప్రవేశం పూర్తి చేసాడు. ఈ విల్లా ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీకి అనుసంధానించబడిన ప్రాంతంలో ఉందని.. కొండాపూర్‌లో చిరెక్ ఇంటర్నేషనల్ స్కూల్‌కి సమీపంలో ఈ విల్లా ఉందని ప్రచారం జరుగుతుంది. 

ఆ పక్కనే మహేష్ బాబు AMB మాల్ కూడా ఉంది. ప్రస్తుతం ఈయన తెరకెక్కిస్తున్న పుష్ప సినిమాకు రెండు రోజులు బ్రేక్ ఇచ్చి గృహప్రవేశం చేసుకుని వెళ్లాడు ఈయన. పుష్ప షూటింగ్ గోదావరి జిల్లాలో జరుగుతుంది. ఈ సినిమాకు ఆస్థాన సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను ముత్తంశెట్టి మీడియాతో కలిసి మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. గందపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో సినిమా వస్తుంది. ఇందులో లారీ డ్రైవర్ పుష్పక్ నారాయణ్ పాత్రలో నటిస్తున్నాడు అల్లు అర్జున్. రష్మిక మందన్న ఇందులో హీరోయిన్ గా నటిస్తుంది. మరోసారి ఓల్డ్ రివేంజ్ డ్రామాతోనే వస్తున్నాడు సుకుమార్.