ఆదివారం 12 జూలై 2020
Cinema - Jun 03, 2020 , 10:09:25

లాక్‌డౌన్‌లో మ‌రో సినీ సెల‌బ్రిటీ వివాహం..!

లాక్‌డౌన్‌లో మ‌రో సినీ సెల‌బ్రిటీ వివాహం..!

లాక్‌డౌన్‌లో టాలీవుడ్ ప‌రిశ్ర‌మకి సంబంధించిన సెల‌బ్రిటీలు ఒక్కొక్క‌రుగా పెళ్లి పీటలెక్కుతున్నారు. కొద్ది రోజుల క్రితం ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు రెండో వివాహం చేసుకోగా, కొద్ది రోజుల త‌ర్వాత నిఖిల్ త‌న ప్రేయ‌సిని పెళ్లాడారు. ఇక మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ నితిన్ కూడా మరి కొద్ది రోజుల‌లోనే ఏడ‌డుగులు వేయ‌నున్నాడు.

తాజా స‌మాచారం ప్ర‌కారం సాహో చిత్ర ద‌ర్శ‌కుడు సుజీత్ త‌న ప్రేయ‌సి ప్ర‌వ‌ల్లిక‌తో జూన్ 10న నిశ్చితార్ధం జ‌రుపుకోనున్న‌ట్టు తెలుస్తుంది. ఈ వేడుక జ‌రిగిన కొద్ది రోజుల‌కే పెళ్ళి పీట‌లు కూడా ఎక్క‌నున్నారు. ప్ర‌వల్లిక వృత్తి రీత్యా డాక్టర్ కాగా,  ఆమె టిక్ టాక్ వీడియోలలో  బాగా ఫేమస్ అట. కొంత కాలంగా ప్రేమలో ఉన్న వీరిద్దరు పెద్దల అనుమతితో పెళ్లి చేసుకోనున్నారని అంటున్నారు. సినిమాల విష‌యానికి వ‌స్తే సుజీత్ ప్ర‌స్తుతం లూసిఫ‌ర్ రీమేక్ స్క్రిప్ట్‌తో బిజీగా ఉన్నాడు. చిరంజీవి ప్ర‌ధాన పాత్ర‌లో ఈ సినిమాని తెర‌కెక్కించ‌నున్నాడు. 


logo