బుధవారం 21 అక్టోబర్ 2020
Cinema - Oct 15, 2020 , 13:28:13

నాగ్‌ను బిట్టు అని పిల‌వ‌డానికి కార‌ణం చెప్పిన సుజాత‌

నాగ్‌ను బిట్టు అని పిల‌వ‌డానికి కార‌ణం చెప్పిన సుజాత‌

బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్య‌క్ర‌మం తెలుగులో మంచి టీఆర్‌పీతో దూసుకెళుతుంది. సీజ‌న్ 1 కార్య‌క్ర‌మాన్ని ఎన్టీఆర్ హోస్ట్ చేయ‌గా, సీజ‌న్ 2కు నాని వ్యాఖ్యాత‌గా ఉన్నారు. ఇక మూడు, నాలుగు సీజ‌న్స్‌కి నాగార్జున‌నే హోస్ట్ గా ఉన్నారు . అయితే  ఈ సీజ‌న్‌లో నాగార్జున‌ని సుజాత బిట్టు అని పిల‌వ‌డం ఆయ‌న అభిమానుల‌కు అస్స‌లు మింగుడు ప‌డలేదు. ఆమెను హౌజ్ నుండి తొంద‌ర‌గా పంపించేయాల‌ని డిసైడ్ అయిన ఫ్యాన్స్  త‌క్కువ ఓట్లు వేసి చివ‌ర‌కు ఎలిమినేట్ అయ్యేలా చేశారు.

హౌజ్ నుండి బ‌య‌ట‌కు వ‌చ్చిన  ఐదో కంటెస్టెంట్ సుజాత బిగ్ బాస్ హౌజ్‌కు సంబంధించిన ప‌లు ఆస‌క్తిర విష‌యాలు వెల్ల‌డించింది. తాను నాగార్జునని బిట్టు అని పిల‌వడానికి గ‌ల కార‌ణం కూడా చెప్పుకొచ్చింది. బిగ్ బాస్ టీం న‌న్ను నాగార్జున అంటే ఇష్ట‌మా అని అడిగారు. అందుకు ఇష్టం అని చెప్పిన నేను మ‌నం సినిమాలో ఆయ‌న చేసిన బిట్టు పాత్ర మ‌రింత ఇష్ట‌మ‌ని చెప్పాను. ఆయ‌న‌ను బిట్టు అని పిల‌వ‌డం మీకు ఇష్ట‌మా అని వారు అడిగారు, ఇందుకు స‌రే అన్నాను. నేను ఆయ‌న అనుమ‌తి తీసుకొని  పిలిచిన‌ప్పుడు   నాగార్జున స‌ర్ చాలా సంతోషప‌డ్డారు. 

ఒక‌వేళ అలా పిల‌వ‌డం నాగార్జున‌కు గానీ, బిగ్‌బాస్ టీమ్‌కు కానీ న‌చ్చ‌క‌పోతే వెంట‌నే క‌న్ఫెష‌న్ రూమ్‌లోకి పిలిచి వ‌ద్ద‌ని చెప్పేవాళ్లు. కానీ వాళ్లంత‌ట వాళ్లే బిట్టు అని పిల‌వ‌మ‌న్నారు. అయితే ఇది ఆయ‌న అభిమానుల‌కు బాధ క‌లిగిస్తే క్ష‌మించండి. నేను కావాల‌ని మాత్రం పిల‌వ‌లేదు" అని  బిట్టు వెనుక స్టోరీ చెప్పుకొచ్చింది సుజాత‌. కాగా, సుజాత ఎలిమినేట్ కావ‌డానికి ముఖ్య కార‌ణం ఆమె ఫేక్ న‌వ్వు, టాస్క్‌లో స‌రిగా పాల్గొన‌క‌పోవ‌డం, నాగార్జున‌ని బిట్టు అని పిల‌వ‌డం అని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు. 


logo