సోమవారం 26 అక్టోబర్ 2020
Cinema - Oct 12, 2020 , 09:23:01

క‌రెక్ట్‌గా గెస్ చేసిన గంగ‌వ్వ‌..బిగ్‌బాస్ హౌజ్‌కు సుజాత గుడ్ బై

క‌రెక్ట్‌గా గెస్ చేసిన గంగ‌వ్వ‌..బిగ్‌బాస్ హౌజ్‌కు సుజాత గుడ్ బై

బిగ్ బాస్ సీజ‌న్ 4 కార్య‌క్ర‌మం 16 మంది స‌భ్యుల‌తో మొద‌లు కాగా, వీరికి జ‌త‌గా ముగ్గురు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు. మొత్తంగా 19 మంది స‌భ్యులు బిగ్ బాస్ హౌజ్‌లో ఉండ‌గా ఇప్ప‌టికే ఐదుగురు ఎలిమినేట్ అయ్యారు. గంగ‌వ్వ అనారోగ్యంతో నిష్క్ర‌మించింది. దీంతో ప్ర‌స్తుతం హౌజ్‌లో 13 మంది స‌భ్యులు ఉన్నారు. శ‌నివారం రోజు నామినేష‌న్‌లో 9 మంది కంటెస్టెంట్స్ ఉండ‌గా, వీరిలో అఖిల్, సోహైల్‌ను ఆ రోజే సేవ్ చేశారు నాగ్.

ఇక ఆదివారం రోజు ఎడుగురు ఎలిమినేషన్ ప్రక్రియలో ఉండ‌గా, వీరిలో  మోనాల్, అభిజీత్, అమ్మ లాస్య, నోయల్, అరియానాల‌ని సేవ్ చేశారు. ఇక మిగిలిన  ఇద్ద‌రు కంటెస్టెంట్స్  రాజశేఖర్, జోర్దార్ సుజాతల‌ని గార్డెన్ ఏరియాలోకి పిలిపించిన నాగార్జున ఇద్ద‌రికి సుత్తి ఇచ్చి ఐస్ ప‌గ‌ల‌గొట్ట‌మ‌ని చెప్పాడు. ఐస్ ప‌గ‌ల‌గొట్టే క్ర‌మంలోకార్డ్ బ‌య‌ట‌ప‌డ‌గా, ఇందులో సుజాత ఫోటో బ‌య‌ట‌ప‌డింది. దీంతో ఆమె ఎలిమినేట్ అయిన‌ట్టు ప్ర‌క‌టించారు నాగార్జున‌. అయితే శ‌నివారం రోజు స్టేజ్‌పై నుండి సుజాతతో మాట్లాడిన గంగవ్వ‌.. ఎందుకో  ఈవారం నువ్వు బ‌య‌ట‌కు వ‌స్తావేమో అని అనిపిస్తుంది అని చెప్పింది. గంగ‌వ్వ చెప్పిన‌ట్టే బిగ్ బాస్ సుజాత‌ను ఐదో ఎలిమినేట‌ర్‌గా బ‌య‌ట‌కు పంపారు. 

న‌వ్వుకుంటూ ఇంట్లోకి ప్ర‌వేశించిన సుజాత న‌వ్వుతూనే గేమ్ ఆడింది, అలానే న‌వ్వుతూనే బ‌య‌ట‌కు వ‌చ్చింది. బిగ్ బాస్ స్టేజ్‌పైకి వ‌చ్చిన సుజాత‌ని ఇంటి స‌భ్యుల‌పై నీ అనుబంధం ఎలాంటిదో హార్ట్ ముక్క‌ల ద్వారా చెప్పాల‌ని కోరాడు. దీంతో త‌న‌కు ఇష్ట‌మైన లాస్య‌, నోయ‌ల్‌ల‌కు హార్ట్‌ సింబ‌ల్ పెట్టింది. ఇక మిగ‌తా హౌజ్‌మేట్స్ అభిజిత్,  అమ్మ రాజ‌శేఖ‌ర్,అరియానా, మెహ‌బూబ్‌, కుమార్ సాయికి   పగిలిన గుండె బొమ్మ‌ని పెట్టింది. అయితే అభిజిత్ త‌న‌ని త‌ప్పుగా అర్ధం చేసుకున్నాడ‌ని తెగ ఫీలైంది సుజాత్. ఇక  వెళ్ళే ముందు కెప్టెన్‌గా ఉన్న సోహైల్‌పై బిగ్ బాంబ్ వేసింది ‌. ఈ బిగ్ బాంబ్ ప్రకారం సోహైల్ వారం మొత్తం ఇంట్లో ఉన్న గిన్నెలు అన్ని తోమాల్సి ఉంది. 

 సుజాత‌.. తాను ఎలిమినేట్ అవుతానని అస్సలు అనుకోలేదని నాగార్జునకు చెప్పింది. అనుకోనిది జరిగితేనే బిగ్ బాస్ హౌజ్ కదా అంటూ తనను తాను సర్దిచెప్పుకుంది. నాలా నేను ఉండేట్టు బిగ్ బాస్ చేసింది. హైద‌రాబాద్‌కు ఏదో నౌక‌రి కోసం వ‌చ్చా.  మా అమ్మ వాళ్లకు నా బిడ్డ అంతే అన్న‌ట్టు ఉంటా అనుకున్నా. కాని ఈ రోజు వాళ్ళు సంతోష ప‌డేలా ఈ స్థాయికి వ‌చ్చాను అంటూ కొంత ఎమోష‌న‌ల్ అయింది సుజాత. 
logo