అందం, అభినయంతో పాటు తన క్యూట్ స్మైల్‌తో లక్షలాది ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న మేటి నటి సుహాసిని. ఎన్నో అద్భుతమైన చిత్రాలలో కథానాయికగా నటించి అలరించిన సుహాసిని ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్‌లోను సత్తా చాటుతుంది. సుమంత్ తాజా చిత్రం మళ్లీ మొదలైందిలో వ్యాపార వేత్తగా కనిపించనుందని టాక్.
ఆగస్ట్ 15న సుహాసిని తన 60వ బర్త్‌డేని గ్రాండ్‌గా జరుపుకుంది.ఈ వేడుకకి కమల్ హాసన్ ఫ్యామిలీతో పాటు అలనాటి తారలు రమ్యకృష్ణ, ఖుష్బూ, సుమలత తదితరులు హాజరయ్యారు. వీరు పార్టీలో చేసిన సందడి అంతా ఇంతా కాదు. ముఖ్యంగా సుహాసినితో కలిసి రమ్యకృష్ణ, ఖుష్బూలు డ్యాన్స్ చేయగా ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది.
సుహాసిని బర్త్ డే వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఖుష్బూ,రమ్యకృష్ణ తమ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఎప్పుడూ వెలుగుతూ ఉండే సుహాసినితో ఎంతో విలువైన సమయాన్ని గడిపాను అని రమ్యకృష్ణ చెప్పుకొచ్చారు. ఇక దీనిపై సుహాసిని స్పందిస్తూ.. లవ్యూ రమ్య కుట్టి అని సుహాసిని కామెంట్ చేసింది.
ఒకప్పుడు సత్తా చాటిన ఈ సీనియర్ భామలు ప్రస్తుతం తెలుగు, తమిళ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. లైగర్, రిపబ్లిక్, రంగమార్తాండ అంటూ రమ్యకృష్ణ బిజీగా ఉన్నారు. ఖుష్బూ శర్వానంద్ సినిమాలో నటిస్తున్నారు. కాగా, 1988 ఆగస్ట్ 25న సుహాసిని, మణిరత్నంకి వివాహ జరగగా వీరికి ఒక కుమారుడు ఉండగా అతని పేరు నందన్ .