‘కలర్‌ఫోటో’ చిత్రంతో హీరోగా మారిన సుహాస్ హీరోగా నటిస్తున్న నూతన చిత్రం ‘ఫ్యామిలీడ్రామా’. మెహెర్ తేజ్ స్వీయ దర్శకత్వంలో తేజ కాసరపుతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. థ్రిల్లర్ క్రైమ్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో సుహాస్ పాత్ర వైవిద్యంగా వుంటుందని, డిఫరెంట్ ఫ్యామిలీ డ్రామాగా చిత్రం అన్ని వర్గాలను అలరిస్తుందనే విశ్వాసాన్ని దర్శకుడు తెలియజేశారు. పూజా కిరణ్, అనుషా నూతుల ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం:అజయ్ అండ్ సంజయ్