సోమవారం 21 సెప్టెంబర్ 2020
Cinema - Aug 05, 2020 , 20:27:00

న‌ల్ల‌గున్నోడు అంద‌మైన అమ్మాయిని ప్రేమిస్తే..

న‌ల్ల‌గున్నోడు అంద‌మైన అమ్మాయిని ప్రేమిస్తే..

సుహాస్, చాందినీ చౌద‌రి హీరోహీరోయిన్లుగా వ‌స్తోన్న చిత్రం క‌ల‌ర్ ఫొటో. బ్లాక్ అండ్ వైట్ బ్యాక్ డ్రాప్ కాలంనాటి ప్రేమ‌క‌థ నేప‌థ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజ‌ర్ ను చిత్ర‌యూనిట్ విడుద‌ల చేసింది. నాలాంటి న‌ల్ల‌గున్నోడు మీలాంటి అంద‌మైన అమ్మాయిని ప్రేమిస్తే ప‌క్క‌నున్న ఫ్రెండ్స్  ఎగ‌తాళి చేస్తుంటారు. ఒక‌డు బ్లాక్ అండ్ వైట్, ఒక‌డేమో గులాబ్ జామ్ ర‌స‌గుల్లా అంటాడు.ఆశ‌కు హ‌ద్దుండాలి అంటూ సుహాస్ డైలాగ్స్ చెప్తుంటే చాందినీ అలా వింటోంది. ల‌వ్ స్టోరీ నేప‌థ్యంలో సాగే ఈ చిత్రంలో ప్రముఖ న‌టుడు సునీల్ పోలీసాఫీస‌ర్ పాత్ర‌లో క‌నిపిస్తున్నాడు. త‌న‌దైన డైలాగ్ డెలివ‌రీతో సాగే సునీల్ సంభాష‌ణలు ఆక‌ట్టుకుంటున్నాయి.

సందీప్ రాజ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ చిత్రానికి కాల‌భైర‌వ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌. సాయి రాజేశ్ నీలం, బెన్నీ ముప్ప‌నేని నిర్మిస్తున్నారు. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ‌, డియ‌ర్ కామ్రేడ్‌, ప్ర‌తీ రోజూ పండ‌గే, మ‌జిలీ చిత్రాల్లో స్నేహితుడిగా, ఇత‌ర పాత్ర‌ల్లో క‌నిపించాడు సుహాస్. 
లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo