బుధవారం 27 మే 2020
Cinema - May 20, 2020 , 15:32:43

లాక్‌డౌన్‌ టైంలో బెల్లీ డ్యాన్స్‌ నేర్చుకున్న షారుక్ కూతురు

లాక్‌డౌన్‌ టైంలో బెల్లీ డ్యాన్స్‌ నేర్చుకున్న షారుక్ కూతురు

ముంబై: లాక్‌డౌన్ సమయంలో సెలబ్రిటీలంతా సరదాగా తమకు నచ్చిన పనులు చేసుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. స్టార్‌ హీరోల పిల్లలు కూడా ఏదో పనితో లాక్‌డౌన్‌ సమయాన్ని వినియోగించుకుంటున్నారు. ఇప్పటికే జాన్వీకపూర్‌, సారా అలీఖాన్‌ డ్యాన్స్‌ తరగతులకు హాజరవుతూ హోం క్వారంటైన్‌ సమయాన్ని గడిపారు.

తాజాగా బాలీవుడ్‌ స్టార్‌ హీరో షారుక్‌ కూతురు సుహానా ఖాన్‌ ఆన్‌లైన్‌ నృత్య తరగతులకు హాజరైంది. తన శిక్షణను మొదట బెల్లీ డ్యాన్స్‌తో షురూ చేసింది. సుహానా తరగతులకు హాజరైనప్పటి ఫొటోతోపాటు ప్రస్తుత ఫొటోను ప్రముఖ ట్రైనర్‌ సంజన ముత్రేజా షేర్‌ చేసింది. లాక్‌డౌన్‌ 4.0లోపు సుహానాఖాన్‌ బెల్లీ డ్యాన్స్‌ను నేర్చుకుంది అంటూ సంజన ఇన్‌స్టాగ్రామ్‌లో క్యాప్షన్‌ ఇచ్చింది.


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo