శుక్రవారం 07 ఆగస్టు 2020
Cinema - Jul 05, 2020 , 16:14:47

మెడల్ తీసుకున్న ఫొటో షేర్ చేసిన యువనటుడు

మెడల్ తీసుకున్న ఫొటో షేర్ చేసిన యువనటుడు

టాలీవుడ్ యాక్టర్ సుధీర్ బాబు ఒకప్పుడు మంచి బ్యాడ్మింటన్ ప్లేయర్ అనే సంగతి అందరికీ తెలిసిందే. స్కూల్ డేస్ లో బ్యాడ్మింటన్ లో ఉత్తమ ప్రతిభ కనబరిచాడు. నేషనల్ స్కూల్ గేమ్స్ లో రన్నరప్ గా నిలిచి..మెడల్ అందుకున్నాడు. మెడల్ అందుకున్నప్పటి అరుదైన త్రోబ్యాక్ స్టిల్ ను సుధీర్ బాబు సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నాడు. మాజీ బ్యాడ్మింటన్ ప్లేయర్ అయిన సుధీర్ బాబు ఆంధ్రప్రదేశ్ లో బ్యాడ్మింటన్ లో నంబర్ వన్ ర్యాంకు సాధించాడు.

బ్యాడ్మింటన్ స్టార్, కోచ్ పుల్లెల గోపీచంద్ తో కలిస డబుల్స్ పార్ట్ నర్ గా కూడా వ్యవహరించాడు. నాగచైతన్య హీరోగా నటించిన ఏమాయ చేశావే చిత్రంతో నటుడిగా మారాడు సుధీర్ బాబు. ఆ తర్వాత ఎస్ఎంఎస్ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. బాఘీ చిత్రంతో విలన్ గా కనిపించి..హిందీలో కూడా తన ప్రతిభను నిరూపించుకునేందుకు ప్రయత్నించాడు. ప్రస్తుతం ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వి చిత్రంలో నటిస్తున్నాడు. నాని, సుధీర్ బాబు ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న ఈ చిత్రంలో నివేదా థామస్, అదితీరావు హైదరి హీరోయిన్లు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్‌లోడ్ చేసుకోండి.


logo