శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Cinema - Jan 27, 2021 , 19:55:08

సుధీర్ బాబు లెగ్ వ‌ర్క‌వుట్స్ చూడండి..వీడియో వైర‌ల్

సుధీర్ బాబు లెగ్ వ‌ర్క‌వుట్స్ చూడండి..వీడియో వైర‌ల్

టాలీవుడ్ యాక్ట‌ర్ సుధీర్‌బాబు త‌న టైం టేబుల్‌లో జిమ్ సెష‌న్ కు ప్ర‌త్యేకంగా స‌మ‌యం కేటాయించుకుంటాడ‌ని ప్ర‌త్యేకంగా చెప్పన‌వస‌రం లేదు. అప్పుడ‌ప్పుడు జిమ్‌లో సీరియ‌స్ గా వ‌ర్క‌వుట్స్ చేస్తున్న వీడియోల‌ను షేర్ చేస్తుంటాడు. ఉత్త‌మ ఫ్యాట్‌ బ‌ర్నింగ్ వ‌ర్క‌వుట్ కాళ్లు. కాళ్ల‌తో చేసే వ్యాయామం మొత్తం శ‌రీరానికే ఓ ఛాలెంజ్.  ఒక సింగిల్ సెష‌న్ లో చేసే క‌స‌ర‌త్తుల‌తో కండ‌రాల దెబ్బ‌తినే అవ‌కాశం ఉంటుంది. రాబోయే రోజుల్లో మీ శరీరం కోలుకోవడానికి కేలరీలు బర్న్ చేయాలి. మ‌రిన్ని వివ‌రాల కోసం నా లైఫ్ స్టైల్ కోచ్ కునాల్‌గిర్ ను ఫాలో అవ్వండి అంటూ లెగ్స్ వ‌ర్క‌వుట్స్ సెష‌న్ తో చెమ‌టోడుస్తున్న వీడియోను సుధీర్‌బాబు ట్విట‌ర్ లో పోస్ట్ చేశాడు.

ఈ వీడియో ఇపుడు నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది. ప్ర‌స్తుతం శ్రీదేవి సోడా సెంట‌ర్ సినిమాలో న‌టిస్తున్నాడు సుధీర్‌బాబు. గోపీచంద్ బ‌యోపిక్ తోపాటు మ‌రో చిత్రాన్ని లైన్ లో పెట్టాడు. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo