ఆదివారం 31 మే 2020
Cinema - May 04, 2020 , 08:57:19

సుధీర్ బాబు తాజా స్టంట్ చూస్తే నోరెళ్ల‌పెట్టాల్సిందే..!

సుధీర్ బాబు తాజా స్టంట్ చూస్తే నోరెళ్ల‌పెట్టాల్సిందే..!

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బావ సుధీర్ బాబు న‌టుడిగా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. తెలుగులోనే కాక అడ‌పాద‌డపా హిందీ భాష‌ల‌లోను వైవిధ్య‌మైన పాత్ర‌లు పోషిస్తున్నాడు. అయితే సుధీర్‌లో దాగి ఉన్న మ‌రో టాలెంట్ అంద‌రి నోరెళ్ల‌పెట్టేలా చేస్తుంది. ప్ర‌స్తుతం లాక్‌డౌన్ వ‌ల‌న ఇంటికే ప‌రిమిత‌మైన సుధీర్ బాబు ఇంట్లో అనేక విన్యాసాలు చేస్తున్నాడు . త‌న ఫిట్‌నెస్ కోసం అప్పుడ‌ప్పుడు స్టంట్ వీడియోలు చేస్తూ వ‌స్తున్న సుధీర్ బాబు తాజాగా గాల్లోకి ఎగిరి రెండు కాళ్ల‌ని ప‌ట్టుకున్నాడు. ఇది చూసిన నెటిజ‌న్స్ నోరెళ్ల‌పెట్టారు. గ‌తంలో సుధీర్ బాబు గాల్లోనే శీర్షాస‌నం వేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రచిన విష‌యం తెలిసిందే. 


logo