శుక్రవారం 05 మార్చి 2021
Cinema - Jan 27, 2021 , 00:34:08

వివేక్‌ ఆత్రేయ పాటతో ‘బొమ్మ బ్లాక్‌బస్టర్‌'

వివేక్‌ ఆత్రేయ పాటతో ‘బొమ్మ బ్లాక్‌బస్టర్‌'

నందు విజయ్‌కృష్ణ, రష్మి జంటగా నటిస్తున్న చిత్రం ‘బొమ్మ బ్లాక్‌బస్టర్‌'. రాజ్‌విరాట్‌ దర్శకుడు. ప్రవీణ్‌ పగడాల, బోసుబాబు నిడుమోలు, ఆనంద్‌ రెడ్డి మది, మనోహర్‌ రెడ్డి యెడ నిర్మాతలు. ఈ చిత్రంలోని ‘నడకుడి రైటంటి సోదరా’ అంటూ సాగే పాటను  ఇటీవల హీరో సుధీర్‌బాబు విడుదల చేశారు. ఈ పాటకు మెంటల్‌మదిలో, బ్రోచేవారెవురా చిత్రాలతో దర్శకుడిగా విజయాలను అందుకుని, ప్రస్తుతం నానితో ‘అంటే సుందరానికి’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న వివేక్‌ ఆత్రేయ సాహిత్యాన్ని అందించారు. సుధీర్‌బాబు మాట్లాడుతూ ‘ఈ చిత్రంలో నందు కొత్తగా కనిపిస్తున్నాడు. దర్శకుడు వివేక్‌ ఆత్రేయ రచించిన ఈ పాట ఎంతో ప్రామిసింగ్‌గా వుంది. తప్పకుండా చిత్రం అందరి ఆదరణ పొందాలని ఆశిస్తున్నా’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ప్రశాంత్‌ ఆర్‌.విహారి.

VIDEOS

logo