ఆదివారం 17 జనవరి 2021
Cinema - Nov 30, 2020 , 09:25:37

నాగ్ అలిసిపోయారు, ఇక నేనే హోస్ట్‌: సుదీప్‌

నాగ్ అలిసిపోయారు, ఇక నేనే హోస్ట్‌:  సుదీప్‌

సండే రోజు బిగ్ బాస్ స్టేజ్‌పైకి స్పెష‌ల్ అతిథి వచ్చారు. నాగ్‌తో క‌లిసి ఇంటి స‌భ్యులని చాలా ఎంట‌ర్‌టైన్ చేశారు. ఆయ‌న ఎవ‌రో కాదు క‌న్న‌డ స్టార్ హీరో, బిగ్‌బాస్ ఏడు సీజ‌న్ల‌ను వ‌రుస‌గా హోస్ట్ చేసిన కిచ్చా సుదీప్. ఈగ‌, బాహుబ‌లి, సైరా చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కులని అల‌రించిన ఆయ‌న ఆదివారం హౌజ్‌మేట్స్‌తో కాసేపు స‌ర‌దాగా ముచ్చటించారు. మీ వ‌ల‌న నాగ్ అలిసిపోయార‌ని, అందుకే ఈ హోస్టింగ్ బాధ్య‌త నాకు ఇచ్చార‌ని సుదీప్ చెప్ప‌డంతో హౌజ్‌మేట్స్ ఎవ‌రు న‌మ్మ‌లేదు. అయితే నాగ్ స‌ర్ రావాలి అంటే మీరు ఒక్కో కార‌ణం చెప్పాల్సి ఉంటుంది అన్నారు సుదీప్.

ముందుగా హారిక మాట్లాడుతూ.. నాగ్ స‌ర్‌కి మా మీద చాలా కేరింగ్  అని పేర్కొంది. అరియానా మా మీద ఇష్టంతో స్వెట‌ర్లు, డ్రైఫూట్లు, డ్రెస్సులు తీసుకువ‌చ్చారు అని చెప్పింది. దీనికి సుదీప్ నేను స్వెట‌ర్ ఇస్తే నేనూ ఇక్క‌డే ఉండొచ్చా అని పంచ్ వేశారు. అభిజీత్ స‌ర్ ఈజ్ కింగ్. ఆయ‌న వ‌ల‌నే షో ఇంత స‌క్సెస్‌ఫుల్‌గా న‌డుస్తుంది ఇలా అంద‌రు నాగ్‌పై ప్ర‌శంస‌లు కురిపించ‌డంతో సుదీప్ ఆయ‌నని ఆహ్వానించారు. మీ ప్రేమ‌కు ధ‌న్య‌వాదాలు అని తెలియ‌జేశారు నాగార్జున.