గురువారం 21 జనవరి 2021
Cinema - Nov 29, 2020 , 11:31:14

బిగ్ బాస్ వేదిక‌పై మ‌రో స్టార్ హీరో..!

బిగ్ బాస్ వేదిక‌పై మ‌రో స్టార్ హీరో..!

బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రిస్తున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్. ఈ షో ప్ర‌స్తుతం తెలుగులో నాలుగో సీజ‌న్ జ‌రుపుకుంటుంది. మ‌రో మూడు వారాల‌లో ఈ సీజ‌న్‌కు శుభం కార్డ్ ప‌డనుండ‌గా, విజేత‌గా ఎవ‌రు నిలుస్తారు అనే దానిపై ఉత్కంఠ నెల‌కొంది. అయితే  గ‌తంలో బిగ్ బాస్ షో ద్వారా చాలా మంది స్టార్స్ త‌మ సినిమాల‌ని ప్ర‌మోట్ చేసుకున్నారు. ఈ సారి క‌రోనా వ‌ల‌న అంత‌గా సాధ్యం కావ‌డం లేదు.

ద‌స‌రాకు అఖిల్ బిగ్ బాస్ వేదిక‌పై నుండి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ చిత్రాన్ని ప్ర‌మోట్ చేసుకోగా, ఈ రోజు క‌న్న‌డ స్టార్ హీరో సుదీప్ త‌న తాజా చిత్రం ఫాంథ‌మ్ ప్రమోష‌న్‌లో భాగంగా బిగ్ బాస్ షోకు హాజ‌ర‌య్యాడు. నాగ్‌తో క‌లిసి కాసేపు సంద‌డి చేయ‌నున్నాడు. తెలుగు బిగ్ బాస్ షోకు హాజ‌రైన విష‌యాన్ని సుదీప్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేశాడు.  నాగార్జునతో కలిసి తెలుగు బిగ్ బాస్ తెరపై కనిపించనుండటం, బిగ్ బాస్ కంటిస్టెంట్లతో మాట్లాడుతూ సరదాగా గడపడం చాలా ఆనందంగా ఉందని ఆయన పేర్కొన్నారు. 


logo