శనివారం 23 జనవరి 2021
Cinema - Nov 27, 2020 , 12:32:55

కండ‌లు తిరిగిన దేహంతో షాకిస్తున్న స్టార్ హీరో

కండ‌లు తిరిగిన దేహంతో షాకిస్తున్న స్టార్ హీరో

క‌న్న‌డ స్టార్ హీరో సుదీప్ తెలుగు ప్రేక్ష‌కుల‌కి కూడా చాలా సుప‌రిచితం. ఈగ సినిమాతో ఎంత‌గానో అల‌రించిన సుదీప్ ఎన్నో తెలుగు చిత్రాలు చేశాడు. ఆ చిత్రాలు సుదీప్‌కు మంచి గుర్తింపు తెచ్చి పెట్టాయి. అయితే ప్ర‌తి చిత్రంలోను నార్మ‌ల్‌గా క‌నిపించే సుదీప్ ఈ సారి మాత్రం త‌న కండ‌ల‌తో అంద‌రికి షాక్ ఇవ్వ‌నుండ‌డంలో ఎలాంటి సందేహం లేదు.

సుదీప్ ప్ర‌స్తుతం ఫాంథ‌మ్ అనే క‌న్న‌డ చిత్రం చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం చిత్ర షూటింగ్ మొద‌లు కాగా, డిసెంబ‌ర్ 4న చివ‌రి షెడ్యూల్ జ‌ర‌ప‌నున్నారు. ఈ షెడ్యూల్‌లో సుదీప్‌పై కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రించ‌నున్నారు. అయితే తాజాగా సుదీప్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా స్ట‌న్నింగ్ ఫొటో షేర్ చేశారు. ఇందులో కండ‌లు తిరిగిన దేహంతో అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నాడు. మంచి ఫుడ్, జీవ‌న శైలి, క్ష‌మ‌శిక్ష‌ణ‌తో  జిమ్‌లో క‌స‌ర‌త్తులు చేయ‌డం వ‌ల‌న ఇలాంటి మేకొవర్ సాధ్య‌మైంద‌ని అంటున్నాడు సుదీప్. ప్ర‌స్తుతం సుదీప్ ఫొటో సోష‌ల్ మీడియాని షేక్ చేస్తుంది. 


logo