శనివారం 30 మే 2020
Cinema - May 23, 2020 , 23:07:02

సుద్దాల అశోక్ ‌తేజకు కాలేయమార్పిడి

సుద్దాల అశోక్ ‌తేజకు కాలేయమార్పిడి

ప్రముఖ పాటల రచయిత, సాహితీవేత్త,  జాతీయ పురస్కార గ్రహీత డాక్టర్‌ సుద్దాల అశోక్‌తేజకు శనివారం ఉదయం  హైదరాబాద్‌ ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఆసుపత్రిలో కాలేయ మార్పిడి చికిత్స జరిగింది. సుద్దాల అశోక్‌తేజ సోదరుడు, ప్రభుత్వ వాస్తు సలహాదారుడు సుద్దాల సుధాకర్‌తేజ శస్త్ర చికిత్స వివరాలు తెలియజేస్తూ ‘శనివారం ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఆరుగంటల వరకు డా॥బాలచందర్‌, డా॥ రాజశేఖర్‌ నేతృత్వంలో కాలేయ మార్పిడి చికిత్స విజయవంతంగా పూర్తయింది. అన్నయ్య చిన్నకుమారుడు అర్జున్‌ కాలేయంలో కొంత భాగం ఇచ్చారు. ప్రస్తుతం తండ్రీకొడుకులిద్దరూ క్షేమంగా ఉన్నారు’ అని పేర్కొన్నారు.logo