శనివారం 30 మే 2020
Cinema - May 21, 2020 , 13:00:26

అస్వ‌స్థ‌త‌కు గురైన సుద్దాల అశోక్ తేజ‌

అస్వ‌స్థ‌త‌కు గురైన సుద్దాల అశోక్ తేజ‌

ప్ర‌ముఖ గేయ ర‌చ‌యిత సుద్దాల అశోక్ తేజ అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. గ‌చ్చిబౌలిలోని ఏషియ‌న్ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట‌రాల‌జీలో చికిత్స పొందుతున్న ఆయ‌న‌కి వైద్యులు కాలేయ మార్పిడి చికిత్స చేయ‌నున్న‌ట్టు తెలుస్తుంది.  ఆయ‌న బ్ల‌డ్ గ్రూప్  బీ నెగెటివ్ కాగా, శ‌స్త్ర చికిత్స స‌మ‌యంలో రక్తం కావ‌ల‌సి ఉంటుంద‌ని , అందుకు సంబంధించి ఏర్పాట్లు చేసుకోమ‌ని స‌న్నిహితుల‌కి చెప్పిన‌ట్టు స‌మాచారం.

సొంత ఊరు సుద్దాల‌ని త‌న ఇంటి పేరుగా మార్చుకున్న ఈయ‌న నమస్తే అన్న చిత్రం ద్వారా తెలుగు సినీ తెరకి పరిచయమయ్యాడు. సినీ నటుడు ఉత్తేజ్‌కి సుద్దాల‌ మేనమామ కావడం వల్ల పరిశ్రమకు పరిచయం కావడం అంత కష్టం కాలేదు. తనికెళ్ళ భరణి లాంటి వారి ప్రోత్సాహంతో సినిమా రంగంలో పాటల ప్రస్థానం ప్రారంభించాడు. ఎన్నో అద్భుత‌మైన గేయాల‌తో అల‌రించిన ఆయ‌న త్వ‌ర‌గా కోలుకోవాల‌ని అభిమానులు ప్రార్ధిస్తున్నారు.


logo