బుధవారం 03 జూన్ 2020
Cinema - Apr 08, 2020 , 09:47:58

మాస్ లుక్‌లో బ‌న్నీ.. అదిరిన ఫ‌స్ట్ లుక్

మాస్ లుక్‌లో బ‌న్నీ.. అదిరిన ఫ‌స్ట్ లుక్

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ ఓ చిత్రాన్ని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. రష్మిక మందన్న కథానాయిక. గత ఏడాది అక్టోబర్‌లో ఈ సినిమా లాంఛనంగా ప్రారంభోత్సవం జరుపుకుంది. మేలో రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలుపెట్టడానికి సన్నాహాలు చేశారు. కరోనా ప్రభావంతో షూటింగ్‌ వాయిదా పడింది. బుధవారం అల్లు అర్జున్‌ జన్మదినోత్సవం సందర్భంగా సినిమాకు సంబంధించిన టైటిల్‌తో పాటు ఫ‌స్ట్ లుక్ రివీల్ చేసింది  మైత్రీ మూవీ మేక‌ర్స్‌.

పుష్ప అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న బన్నీ 20వ చిత్రంలో స్టైలిష్ స్టార్ లుక్ చాలా ర‌ఫ్ అండ్ మాస్ అప్పీరెన్స్ కలిగివుంది. బన్నీ డ్రెస్సింగ్ స్టైల్ చూస్తే రంగస్థలం వలె, ఇది కూడా పీరియడ్ డ్రామానా అనే డౌట్ కొడుతుంది. మైత్రి మూవీ మేకర్స్ భారీ ఎత్తున ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా బన్నీ లారీ డ్రైవర్ గా కనిపించనున్నాడు. ఎర్రచందనం స్మగ్లింగ్‌ కథాంశంతో చిత్తూరు నేపథ్యంలో నడిచే ఇతివృత్తమిదని, అల్లు అర్జున్‌ పాత్ర చిత్రణ నవ్యరీతిలో సాగుతుందని చిత్ర బృందం చెబుతోంది. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్‌ సంగీతాన్నందిస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, త‌మిళం, మ‌ల‌యాళ భాష‌ల‌లో ఫ‌స్ట్ లుక్ విడుద‌ల కావ‌డంతో చిత్రాన్ని భారీ ఎత్తునే నిర్మించ‌నున్న‌ట్టు తెలుస్తుంది.  ఏదిఏమైనా బన్నీ సుకుమార్ లు ఫస్ట్ లుక్ తో మూవీపై అంచనాలు పెంచేశారు.


logo