తాన్యదేశాయ్, అంకిత్‌రాజ్, కావ్యరెడ్డి, సీనియర్ కథానాయకుడు వినోద్‌కుమార్ ముఖ్యతారలుగా తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతున్న చిత్రం ‘స్ట్రీట్‌లైట్’. విశ్వ దర్శకుడు. మామిడాల శ్రీనివాస్ నిర్మాత. నిర్మాణానంతర పనులను పూర్తిచేసుకున్న ఈ చిత్రాన్ని నవంబరు 12న విడుదల చేయనున్నారు. నిర్మాత మాట్లాడుతూ ‘థియేటర్స్‌ను సేవ్ చేయాలని ఓటీటీలో కాకుండా థియేటర్లో విడుదల చేస్తున్నాం. ఒక యువతి తనకు జరిగిన అన్యాయానికి ఏ విధంగా ప్రతీకారం తీర్చుకుందనేది ఈ చిత్రం కథాంశం. తప్పకుండా చిత్రం అన్ని వర్గాల ఆదరణ పొందుతుందనే నమ్మకం వుంది’ అన్నారు.