శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Cinema - Jan 22, 2021 , 07:25:32

సుశాంత్ సింగ్‌కు ద‌క్కిన గొప్ప గౌర‌వం

సుశాంత్ సింగ్‌కు ద‌క్కిన గొప్ప గౌర‌వం

మంచి భ‌విష్య‌త్ ఉన్న బాలీవుడ్ న‌టుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జూన్ 14, 2020న అనుమానాస్ప‌ద రీతిలో మ‌ర‌ణించిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న మృతి అభిమానుల‌కు పీడ క‌ల‌గా మారింది. ఇప్ప‌టికీ సుశాంత్ మ‌ర‌ణాన్ని ఎవ‌రు జీర్ణించుకోలేక‌పోతున్నారు. ఆయ‌నకు త‌గిన న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. 

గురువారం రోజు సుశాంత్ జ‌యంతి కాగా,  దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ (ఎస్‌డీఎంసీ) సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది.  ఆండ్రూస్ గంజ్‌లో ఉన్న స్ట్రెచ్ రోడ్డుకు సుశాంత్ సింగ్ రాజ్‌‌పుత్ పేరు పెట్టాలని  నిర్ణ‌యించారు. ఈ రోడ్డులో ఎక్కువ మంది బీహార్ వాసులే నివ‌సిస్తున్నార‌ని ఇందుకోసం ఆ రోడ్డుకు సుశాంత్ పేరు పెట్టాల‌ని సౌత్ ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ కాంగ్రెస్ కౌన్సిలర్ అభిషేక్ దత్ గ‌త ఏడాది ప్ర‌స్తావ‌న‌కు తెచ్చారు. జ‌న‌వ‌రి 21న అమ‌లులోకి తీసుకొచ్చారు. సుశాంత్‌కు ద‌క్కిన ఈ అరుదైన గౌర‌వంపై అభిమానులు ఆనందిస్తున్నారు. 

VIDEOS

logo