e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, October 22, 2021
Home News శింబు-గౌత‌మ్ మీన‌న్ హ్యాట్రిక్ మూవీ.. ఫ‌స్ట్ లుక్ అదుర్స్

శింబు-గౌత‌మ్ మీన‌న్ హ్యాట్రిక్ మూవీ.. ఫ‌స్ట్ లుక్ అదుర్స్

గౌత‌మ్ మీనన్- శింబు కాంబినేషన్‌పై త‌మిళ ప్రేక్ష‌కుల‌లో భారీ అంచ‌నాలు ఉంటాయి. గతంలో వీరి కాంబోలో వచ్చిన ‘విన్నై తాండి వరువాయాస , ‘అచ్చం యెన్బదు మడమైదా’ చిత్రాలు సూపర్ హిట్స్ గా నిలిచాయి. త‌మిళంలో ఈ చిత్రాలు బ్లాక్ బ‌స్ట‌ర్స్ హిట్ కావ‌డంతో తెలుగులో అవి నాగచైతన్య హీరోగా ‘ఏమాయ చేసావేస , ‘సాహసం శ్వాసగా సాగిపో’ అనే పేర్లతో రూపొందాయి.

ముచ్చ‌ట‌గా మూడోసారి సరికొత్త వినోదంతో ప్రేక్ష‌కుల‌ని అల‌రించేందుకు సిద్ధ‌మైంది శింబు – గౌతమ్ మీనన్ కాంబినేషన్. STR 47 అనే వర్కింగ్ టైటిల్ తో మొన్న‌టి వ‌ర‌కు ప్ర‌చారం జ‌రుపుకున్న ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేశారు. ఈ పోస్ట‌ర్ ద్వారా మూవీ టైటిల్ కూడా అనౌన్స్ చేశారు. ముందుగా ‘నాదిగలై నీరదమ్ సూర్యన్’ అని పేరు పెట్టారు. అయితే ఇప్పుడు ఈ టైటిల్ ని మార్చేసి ”వెందు తనిందంతు కాడు” అని పేరు ఖరారు చేశారు.

- Advertisement -

ఫ‌స్ట్ లుక్‌లో శింబు లుంగీ క‌ట్టి చిరిగిన చొక్కాతో క‌నిపించారు. ఇంటెన్స్ లుక్ లో చాలా డీ గ్లామ‌ర్‌గా క‌నిపిస్తున్న శింబు అంచ‌నాలు పెంచేస్తున్నాడు. ఈ సినిమా శింబు కెరీర్‌లో ప్ర‌త్యేకం అవుతుంద‌ని అనిపిస్తుంది. సెన్సిబుల్ లవ్ స్టోరీల‌కు కేరాఫ్ అడ్రెస్‌గా పేరుగాంచిన గౌతమ్ మీనన్.. ఈసారి డిఫరెంట్ కాన్సెప్ట్ తో రాబోతున్నాడని అర్థం అవుతోంది. ఏ.ఆర్. రెహమాన్ సంగీతం సమకూరుస్తున్నారు. వేల్స్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై ఇషారి కె. గణేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

కాగా శింబు ప్ర‌స్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో ‘మానాడు’ (తెలుగులో ‘రీవైండ్’) అనే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ లో కూడా నటిస్తున్నారు. క‌న్నడ బ్లాక్ బస్టర్ మూవీ ‘ముఫ్తీ’ ని తమిళ్ లో రీమేక్ చేస్తున్నారు. స్టూడియో గ్రీన్ సంస్థ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి నార్తాన్ దర్శకత్వం వహిస్తున్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement