జూన్ 10న నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు పుట్టిన రోజు సంబరాలు జరుపుకుంటున్నారు. ముఖ్యంగా ప్రపంచం నలుమూలల నుంచి కూడా బాలయ్యకు బర్త్ డే విషెస్ తెలిపారు. తెలుగు ఇండస్ట్రీలో కూడా పలువురు చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ సహా చాలా మంది సెలబ్రిటీస్ బాలయ్యకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. బాలీవుడ్ నుంచి కూడా ఈయనకు విషెస్ వచ్చాయి. మరోవైపు రాజకీయ ప్రముఖులు కూడా బాలయ్యకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఇదంతా ప్రతీ ఏడాది జరిగేదే. అంతా విషెస్ చెప్తుంటారు.. కానీ 2021 బర్త్ డే మాత్రం కాస్త ప్రత్యేకంగా మారింది. ఓ ఊహించని సెలబ్రిటీ నుంచి బాలయ్యకు ఈ సారి జన్మదిన శుభాకాంక్షలు అందాయి.
అదే టీమిండియా మాజీ స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్. ఈయన నుంచి బాలయ్యకు బర్త్ డే విషెస్ రావడంతో నందమూరి అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఇది మా బాలయ్య రేంజ్ అంటూ తొడ కొడుతున్నారు. అయితే యువరాజ్ సింగ్ ఏంటి.. బాలయ్యకు బర్త్ డే విష్ చెప్పడం ఏంటి అని అంతా ఆలోచనలో పడిపోయారు. అసలు ఈ ఇద్దరికి ఎక్కడ లింక్ కుదిరిందబ్బా అంటూ ఆశ్చర్యపోతున్నారు. అయితే దీని వెనక ఓ పెద్ద కథే ఉంది.
2011 ప్రపంచ కప్ గెలవడంలో యువరాజ్ సింగ్ పాత్ర మరిచిపోలేనిది. అయితే అంతటి విజయం తర్వాత విషాదం ఆయన జీవితంలో చోటు చేసుకుంది. అదే క్యాన్సర్ మహమ్మారి బారిన పడటం. అది తెలిసి అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. అయితే విదేశాలకు వెళ్లి యువరాజ్ కొన్ని నెలల పాటు చికిత్స తీసుకుని కోలుకున్నాడు.
అప్పట్నుంచి ఇండియాతో పాటు ఫారెన్ లో కూడా క్యాన్సర్ వ్యాధికి సంబంధించిన చైతన్య శిబిరాలను యువరాజ్ నడుపుతున్నాడు. అంతేకాదు ఈ వ్యాధి నయం కోసం పోరాడుతున్న స్వచ్ఛంద సంస్థలతో పాటు హాస్పిటల్స్ కు కూడా యువరాజ్ అండగా నిలుస్తున్నాడు. ఈ క్రమంలోనే ఓసారి హైదరాబాద్ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కు కూడా వచ్చాడు యువరాజ్ సింగ్. ఇది నడుపుతున్న బాలయ్య గురించి తెలుసుకున్నాడు.
ఆయన చేస్తున్న మంచి పనుల గురించి ఆరా తీసాడు. అప్పట్నుంచి ఇప్పటి వరకు బాలయ్యతో టచ్ లోనే ఉన్నాడు యువరాజ్ సింగ్. అప్పుడు దిగిన ఫోటోనే ఇప్పుడు ట్వీట్ చేసాడు కూడా. ఆ అనుబంధంతోనే ఇప్పుడు బాలయ్య బర్త్ డేను గుర్తు పెట్టుకుని మరీ విష్ చేసాడు యువరాజ్ సింగ్. ఇది నేషనల్ వైడ్ గా ట్రెండ్ అవుతుంది. ఇండియాలో చాలా మంది బాలయ్య గురించి గూగుల్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
పవన్‌కల్యాణ్ ఫ్యాన్స్ కు క్రేజీ అప్ డేట్..!
షూటింగ్ కు టైం ఫిక్స్ చేయమన్న చిరంజీవి..!
మరో యువ హీరో దగ్గరికి నితిన్ కథ..!
ఆ సీన్ కోసం రెండు రోజులు స్నానం చేయలేదు!
రాజస్థానీ ట్రెడిషన్ ను చాటి చెబుతా: జాక్వెలిన్
వకీల్‌సాబ్ డైరెక్టర్ తో నాని..!
Recommended Content by ntnews.com