దర్శక నిర్మాతలకు థియేటర్లపై ఇంకా నమ్మకం కుదరలేదా..?

పరిస్థితులు చూస్తుంటే ప్రస్తుతం ఇదే అనిపిస్తుంది. ఏదో మొహమాటానికి సినిమాలు థియేటర్లలో విడుదల చేస్తే బాగుంటుంది అని అంటున్నారు.. గానీ తమ సినిమాలను తీసుకొచ్చి థియేటర్లలో విడుదల చేసేంత ధైర్యం మాత్రం ఎవరూ చేయడం లేదు. ఒకవేళ నిజంగానే అలా సినిమా థియేటర్లలో విడుదల చేసినా కూడా కలెక్షన్లు రావడం లేదు. మొన్న డిసెంబర్ 25కు సాయి ధరమ్ తేజ హీరోగా నటించిన సోలో బ్రతుకే సో బెటర్ సినిమా ఎంత మంచి ఓపెనింగ్స్ తెచ్చుకున్నా కూడా కనీసం 10 కోట్లు కూడా వసూలు చేయలేకపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో తమ సినిమాలను థియేటర్లలో విడుదల చేసుకొని ఏం చేయాలి అంటూ ప్రశ్నిస్తున్నారు దర్శక నిర్మాతలు. సంక్రాంతికి కూడా చాలా సినిమాలు పోటీలో ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా ముందుగానే OTT ఒప్పందం చేసుకొని థియేటర్లలోకి విడుదల అవుతున్నాయి.
జనవరి 13న మాస్టర్.. 14న రవితేజ క్రాక్.. రామ్ రెడ్ సినిమాలు వస్తున్నాయి. ఆ మరుసటి రోజు జనవరి 15న అల్లుడు అదుర్స్ అంటూ బెల్లంకొండ శ్రీనివాస్ వస్తున్నాడు. అయితే ఎన్ని సినిమాలు వస్తున్నా కూడా ప్రేక్షకులతో పాటు దర్శక నిర్మాతలలో కూడా అనుమానాలు మాత్రం అలాగే ఉండిపోతున్నాయి. అందుకే రిస్క్ తీసుకోవడం ఇష్టం లేని కొందరు నిర్మాతలు ఇప్పటికే తమ సినిమాలను ఓటిటి వేదికగా విడుదల చేస్తున్నారు. అందులో నాగార్జున, మోహన్ లాల్ లాంటి స్టార్ హీరోలు కూడా ఉన్నారు. సాధారణంగా వీళ్ళ సినిమాలు థియేటర్లలో విడుదల అయితే కచ్చితంగా ప్రేక్షకులు చూస్తారు. మంచి ఓపెనింగ్స్ కూడా వస్తాయి. అయినా కూడా దర్శక నిర్మాతలలో నమ్మకం కనిపించడం లేదు.
అందుకే నాగార్జున వైల్డ్ డాగ్ సినిమా నేరుగా నెట్ ఫిక్స్ లో విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. జనవరి 26న రిపబ్లిక్ డే కానుకగా ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయబోతున్నారు. కొత్త దర్శకుడు సోలమన్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. మరోవైపు మోహన్ లాల్ ఇండస్ట్రీ హిట్ దృశ్యం సీక్వెల్ దృశ్యం 2 కూడా ఓటిటీలోనే విడుదలవుతుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ సినిమాను భారీ రేటు పెట్టి సొంతం చేసుకుంది. మలయాళంతో పాటు తెలుగు తమిళ వెర్షన్ కూడా ఇక్కడ విడుదలవుతున్నాయి. ఈ రెండు సినిమాలు కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. అయినా కూడా థియేటర్లు కాకుండా నిర్మాతలు ఆన్లైన్ రిలీజ్ వైపు అడుగులు వేస్తున్నారు. ఏదేమైనా కూడా ఎన్ని రోజులు గడిచినా కరోనా భయం మాత్రం అటు నిర్మాతలలో.. ఇటు ప్రేక్షకులలో.. అలాగే ఉండిపోయింది.
తాజావార్తలు
- కోరిన రెండు గంటల్లో దివ్యాంగురాలికి బ్యాటరీ ట్రై సైకిల్ అందజేత
- సమంత ‘శాకుంతలం’లో దుష్యంతుడు ఇతగాడే
- బంగారంపై మోజు పెరుగుతుంటే ధరలు తగ్గుతున్నాయ్.. ఎందుకంటే?!
- వేములవాడలో అక్రమ వడ్డీ వ్యాపారులపై పోలీసుల కొరడా
- పవన్‌తో నాకు ముడి పెడితే తాట తీస్తా: అశు రెడ్డి
- 9 నుంచి శ్రీశైల క్షేత్రానికి ప్రత్యేక బస్సులు
- పశ్చిమ బెంగాల్లో ఇద్దరు మాజీ పోలీసుల ‘టగ్ ఆఫ్ వార్’
- టీఆర్ఎస్ అభ్యర్థి పల్లాకే పీఆర్టీయూ మద్దతు
- మంచు మనోజ్ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడా..?
- సెకండ్ డోస్ తీసుకున్నాక.. కరోనా సోకింది..!