శనివారం 31 అక్టోబర్ 2020
Cinema - Oct 06, 2020 , 19:32:05

ఫ‌స్ట్ సీన్ లోనే గాయం..ఇప్ప‌టికీ కాలిలోనే రాడ్

ఫ‌స్ట్ సీన్ లోనే గాయం..ఇప్ప‌టికీ కాలిలోనే రాడ్

1995లో వ‌చ్చిన బ‌ర్సాత్ సినిమాతో చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు బాబీడియోల్‌. అయితే తొలి సినిమాలో మొద‌టి సీన్ లోనే తీవ్రంగా గాయ‌ప‌డ్డాడ‌ట బాబీడియోల్‌. ఓ ఇంట‌ర్వ్యూలో బాబీ మాట్లాడుతూ..నా తొలి సినిమా బ‌ర్సాత్‌, నా సోద‌రుడు ఇంట్ర‌డ‌క్ష‌న్ సీన్ చాలా కొత్త‌గా, ఆస‌క్తిక‌రంగ తీయాల‌నుకున్నాడు. అప్ప‌డు మేం ఇంగ్లాండ్ లోని లేక్ జిల్లాలో ఉన్నాం. అదే నా ఫ‌స్ట్ షాట్‌.నేను గుర్రాన్ని ఎక్కే క్ర‌మంలో మ‌రో గుర్రానికి ఢీకొట్టాను. దీంతో కాలి లోప‌ల తీవ్ర‌గాయ‌మైంది. డాక్ట‌ర్లు స‌ర్జ‌రీ చేసి నా కాలులో రాడ్ వేశారు. అయితే అప్ప‌టికీ న‌యం కాక‌పోవ‌డంతో మ‌రోసారి శస్త్ర‌చికిత్స చేయాల్సి వ‌చ్చింది.

ప్ర‌స్తుతం కాలు బాగానే ఉంద‌ని చెప్పుకొచ్చాడు. గ‌తేడాది రేస్ 3 లో స‌ల్మాన్ ఖాన్ తో క‌లిసి న‌టించిన బాబీ డియోల్ ప్ర‌స్తుతం క్లాస్ ఆఫ్ 83 సినిమాతోపాటు ఆశ్ర‌మ్ సిరీస్ లో న‌టిస్తున్నాడు. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.