శుక్రవారం 05 జూన్ 2020
Cinema - May 19, 2020 , 12:44:18

ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్ చెప్పిన ట్రైన‌ర్

ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్ చెప్పిన ట్రైన‌ర్

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ బ‌ర్త్‌డే మే 20న కాగా, ఆ రోజు ఆర్ఆర్ఆర్ చిత్రంలోని ఎన్టీఆర్ లుక్ లేదా టీజ‌ర్ విడుదల అవుతుంద‌ని ఫ్యాన్స్ భావించారు. కాని లాక్‌డౌన్ వ‌ల‌న నిర్మాత‌లు అభిమానుల ఆశ‌ల‌పై నీళ్ళు చ‌ల్లారు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌లో పనులన్నీ ఆగిపోవడం, సాంకేతిక సమన్వయలోపం వ‌ల‌న టీజ‌ర్ విడుద‌ల చేయ‌డం లేద‌ని పేర్కొన్నారు.

అయితే ఆర్ఆర్ఆర్ మేక‌ర్స్ స‌ర్‌ప్రైజ్ ఇవ్వ‌క‌పోయిన‌ప్ప‌టికీ, ఎన్టీఆర్‌ పర్సనల్‌ ట్రైనర్‌ లాయిడ్‌ స్టీవెన్స్ మాత్రం ఫ్యాన్స్ కోసం కొన్ని సిద్దం చేసిన‌ట్టు త‌న ట్విట్ట‌ర్ ద్వారా పేర్కొన్నారు. ఈ రోజు ఒక్కొక్క‌టిగా విడుద‌ల కానున్న స‌ర్‌ప్రైజింగ్‌ల కోసం ఫ్యాన్స్ అంద‌రు సిద్ధంగా ఉండాల‌ని స్ప‌ష్టం చేశారు. 


logo