బుధవారం 03 జూన్ 2020
Cinema - Mar 19, 2020 , 12:59:10

ఇంట్లోనే ఉండండి... పుస్తకాలు చదవండి : ఆలియా భట్‌

ఇంట్లోనే ఉండండి... పుస్తకాలు చదవండి : ఆలియా భట్‌

ముంబయి : కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ప్రతి ఒక్కరూ సామాజిక దూరాన్ని పాటిస్తూ వ్యక్తిగత నిర్బంధంలో ఉంటున్నారు. చిత్ర పరిశ్రమ సైతం ఈ నెల 31 వరకు అన్ని షూటింగ్స్‌ను రద్దు చేసుకుంది. చాలామంది బాలీవుడ్‌ స్టార్స్‌ సోషల్‌ మీడియా ద్వారా తమ అభిమానులకు సందేశాలను ఇస్తూ జాగ్రత్తలు పాటించాల్సిందిగా సూచిస్తున్నారు. ఈ క్రమంలో భాగంగా ప్రముఖ నటి ఆలియా భట్‌ ఇన్‌స్టాగ్రాంలో పుస్తకాన్ని చదువుతున్న ఓ ఫోటోను షేర్‌ చేశారు. ఇంటి వద్దే ఉండండి.. ఓ పుస్తకాన్ని పూర్తి చేయండి అంటూ క్యాప్షన్‌ను జోడించింది. కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా ఆలియా ప్రస్తుతం నటిస్తున్న చిత్రం గంగూబాయి కతియావాడి షూటింగ్‌ ఆగిపోయింది. అదేవిధంగా అయాన్‌ ముఖర్జీ మూవీ బ్రహ్మాస్ర్తాలో రణబీర్‌ కపూర్‌కు జోడిగా నటిస్తోంది. ఇలా ఈ ఏడాది పలు ప్రాజెక్టులు ఆమె చేతిలో ఉన్నాయి. 

ఒక్క ఆలియా భట్‌ మాత్రమే కాకుండా మిగతా బాలీవుడ్‌ స్టార్స్‌ సైతం ఇంట్లో ఏ విధంగా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నది తమ అభిమానులతో పంచుకుంటున్నారు. కరీనా కపూర్‌ ఖాన్‌, సైఫ్‌ అలీఖాన్‌, ట్వింకిల్‌ఖన్నా, అక్షయ్‌ కుమార్‌ ఇలా పలువురు బాలీవుడ్‌ స్టార్స్‌ సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో టచ్‌లో ఉంటూ సమయాన్ని సద్వినియోగం చేసుకునే అంశాలను పంచుకుంటున్నారు. 

View this post on Instagram

stay home & .... finish a book ????????

A post shared by Alia ☀️ (@aliaabhatt) on


logo