పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రాక ముందు నుంచి కూడా మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకున్నాడు. అక్కడ చాలా సంవత్సరాల పాటు అందులో నైపుణ్యం సంపాదించాడు. ఆ తర్వాత దాన్ని సినిమాలో కూడా చూపించాడు. తనతో పాటు చిరంజీవి నటించిన కొన్ని సినిమాల్లో ఫైట్స్ కంపోజ్ చేశాడు పవన్ కళ్యాణ్. ఇప్పటికీ తన సినిమాల్లో యాక్షన్ సన్నివేశాలను సొంతంగా కొరియోగ్రఫీ చేసుకుంటాడు పవర్ స్టార్. ఇదిలా ఉంటే తాజాగా తనకు ఈ మార్షల్ ఆర్ట్స్ పై ఎంత ప్రేమ ఉందో మరోసారి బయట పెట్టాడు పవన్ కళ్యాణ్. అంతే కాదు ఎవరికైనా ఏదైనా సాయం కావాల్సి వస్తే వెంటనే స్పందిస్తాడు పవన్.
తాజాగా ఒక అరుదైన యుద్ధకళను తను ముందుండి నడిపిస్తున్నాడు పవన్. దాన్ని మర్చిపోకుండా నేటి యువతరానికి బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయాడు. తాజాగా అరుదైన యుద్ధ కళ ‘వింగ్ చున్ మార్షల్ ఆర్ట్స్’లో ప్రావీణ్యుడు అయిన ప్రభాకర్ రెడ్డిని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సత్కరించాడు. విదేశాల్లో పుష్కలమైన అవకాశాలున్నప్పటికీ నెల్లూరు యువతకు యుద్ధ విద్య నేర్పిస్తూ ఇక్కడే ఉండటం అభినందనీయమని జనసేనాని ప్రశంసించాడు.
ఈ మధ్య ఇలాంటి ప్రతిభావంతులను వాళ్ల ఇంటికి వెళ్లి మరి ప్రశంసిస్తున్నాడు పవన్ కళ్యాణ్. అలాగే వాళ్లకు సత్కారాలు చేస్తున్నాడు. ఈ మధ్య సినీ గేయ రచయిత పెంచల్ దాస్ ను ప్రత్యేకంగా కలిసి అభినందించాడు.
ఇప్పుడు యుద్ధ విద్యలు నేర్పిస్తున్న ప్రభాకర్ రెడ్డిని సత్కరించాడు. అంతే కాదు అక్కడ ప్రభాకర్ రెడ్డి ఇచ్చిన సూచనలతో పవన్ కళ్యాణ్ కాసేపు ‘వింగ్ చున్ మార్షల్ ఆర్స్’ సాధన చేశాడు. ఇదివరకే పవన్ కరాటే నేర్చుకున్నాడు. దీంతో ఈ కొత్త విద్యపై ఆసక్తి కనబరిచాడు. వీటిని నేటి యువత ముందుకు తీసుకురావడానికి తన సినిమాలలో కూడా యుద్ధ విద్యను వాడుకుంటానని చెప్పాడు పవన్ కళ్యాణ్. ప్రస్తుతం వకీల్ సాబ్, హరిహర వీరమల్లు, అయ్యప్పన్ కోషియన్ రీమేక్ లో నటిస్తూ బిజీగా ఉన్నాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఎన్టీఆర్ సినిమా కోసం కమెడీయన్‌ను విలన్‌గా మారుస్తున్న త్రివిక్రమ్
కుమారుడితో నువ్వు నేను బ్యూటీ ఫన్ టైం- వీడియో వైరల్
విక్రమ్ వేధ హిందీ రీమేక్‌లో తలపడనున్న హృతిక్, సైఫ్!
సీనియర్ హీరోయిన్ తో ఎఫైర్ .. నిజనిజాలేంటో చెప్పిన కమెడీయన్
నితిన్ రంగ్ దే రివ్యూ.. టైమ్‌పాస్ ఎంటర్టైనర్
ఇండస్ట్రీలో మరో విషాదం.. సింగర్ మృతి