బుధవారం 12 ఆగస్టు 2020
Cinema - Jul 11, 2020 , 15:57:59

సుశాంత్‌సింగ్‌ కేసులో 35మంది వాంగ్మూలాలు

సుశాంత్‌సింగ్‌ కేసులో 35మంది వాంగ్మూలాలు

ముంబై: బాలీవుడ్‌ యువనటుడు సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసులో ముంబై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకూ 35 మంది వాంగ్మూలాలు నమోదు చేసినట్లు శనివారం వారు ప్రకటించారు. ఈ విషయానికి సంబంధించి హీరో సల్మాన్‌ఖాన్‌ మాజీ మేనేజర్ రేష్మాశెట్టిని ఐదు గంటలు విచారించి, ఆమె వాంగ్మూలాన్ని బాంద్రా పోలీసులు నమోదు చేసినట్లు ముంబై పోలీసులు వెల్లడించారు. 

కాగా, రాజ్‌పుత్ గత నెలలో ముంబైలోని తన నివాసంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సుశాంత్‌సింగ్‌ ఆకస్మిక మరణంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. టీవీ సీరియళ్లతో కెరీర్‌ షురూ చేసి సినిమాలతో సక్సెస్‌ఫుల్‌ గా కెరీర్‌ కొనసాగిస్తున్న సుశాంత్‌ సింగ్‌ ఆత్మహత్యకు పాల్పడడం సినీ పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ మృతితో బాలీవుడ్‌లో నెపాటిజం తెరపైకి వచ్చింది. బాలీవుడ్‌ చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo