బుధవారం 03 జూన్ 2020
Cinema - Mar 21, 2020 , 12:23:21

పీఎంకి మ‌ద్ద‌తు ప‌లికిన క‌మ‌ల్‌, షారూఖ్

పీఎంకి మ‌ద్ద‌తు ప‌లికిన క‌మ‌ల్‌, షారూఖ్

క‌రోనా వ్యాప్తిని స‌మూలంగా నిర్మూలించేందుకు భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ ‘జనతా కర్ఫ్యూ’కు పిలుపునిచ్చిన సంగ‌తి తెలిసిందే. దీనికి టాలీవుడ్‌, బాలీవుడ్‌, కోలీవుడ్ పరిశ్ర‌మ‌కి చెందిన సెల‌బ్రిటీలతో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు సంఘీభావం తెలుపుతున్నారు. తాజాగా క‌మ‌ల్ హాస‌న్‌, షారూఖ్ ఖాన్, అజ‌య్ దేవ‌గణ్ త‌మ ట్విట్ట‌ర్ ద్వారా జ‌న‌తా క‌ర్ఫ్యూకి మ‌ద్ద‌తు ఇస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు 

జ‌న‌తా క‌ర్ఫ్యూకి మ‌ద్ద‌తు ఇస్తున్న‌ట్టు ప్ర‌క‌టించిన క‌మ‌ల్ హాస‌న్.. ఇలాంటి ప‌రిస్థితుల‌లో మ‌నం క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాలి. దీనిని విప‌త్తుగా భావించి అంద‌రం క‌లిసిక‌ట్టుగా ఇళ్ళ‌ల్లో ఉండ‌డం ద్వారా సుర‌క్షితంగా ఉండ‌వ‌చ్చు. జ‌న‌తా క‌ర్ఫ్యూకి మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని ఫ్యాన్స్‌, మిత్రుల‌ని కోరారు క‌మ‌ల్ .

ఇక బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్ త‌న ట్విట్ట‌ర్‌లో .. సామాజిక దూరాన్ని త‌గ్గించాల‌ని కోరాడు. ఎవ‌రికి వారు సెల్ఫ్ క్వారంటైన్ చేసుకోవాల‌న్నారు. ఈ ల‌క్ష్య సాధ‌న కోసం ఆదివారం జ‌న‌తా క‌ర్ఫ్యూ ఆలోచ‌నే మార్గ‌మ‌ని ఆయ‌న తెలిపారు. సాధ్య‌మైనంత వ‌ర‌కు వ్య‌క్తిగ‌త స్థాయిలో ఈ ఆలోచ‌న కొన‌సాగించాలి. క‌రోనాని నిర్మూలించాల్సిన అవ‌స‌రం ఎంతైన ఉంది. ఆరోగ్యంగా ఉండండి అని పిలుపునిచ్చారు బాలీవుడ్ బాద్ షా 

అజ‌య్ దేవ‌గ‌ణ్ భార‌తీయులంద‌రికి న‌మ‌స్కారంచెబుతూ.. కోవిడ్ 19ని ఎదుర్కొనేందుకు  దృఢ నిశ్చయాన్ని, సంయమనాన్ని చూపించాలని కోరారు. దయచేసి ఈ నెల 22న జనతా కర్ఫ్యూను కూడా పాటించండని కోరారు. సురక్షితంగా ఉండాలని పిలుపునిచ్చారు. మోదీ పిలుపు మేర‌కు  ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జనతా కర్ఫ్యూ మొద‌లు కానున్న విష‌యం తెలిసిందే. భారత దేశాన్ని ఆరోగ్యవంతంగా ఉండేలా నిరంతరం పని చేస్తున్న వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, పురపాలక సంఘాల సిబ్బంది, సాయుధ దళాలు, విమానాశ్రయాల సిబ్బంది తదితరులకు కృతజ్ఞతాపూర్వకంగా ఆదివారం సాయంత్రం 5 గంటలకు అందరూ కరతాళ ధ్వనులు చేయాలని  మోదీ స్ప‌ష్టం చేశారు. logo