ఆదివారం 07 జూన్ 2020
Cinema - Apr 01, 2020 , 11:04:51

కరోనాతో స్టార్‌ వార్స్‌ ఫేమ్ న‌టుడు మృతి

కరోనాతో స్టార్‌ వార్స్‌ ఫేమ్ న‌టుడు మృతి

కరోనా మృతుల సంఖ్య రోజురోజుకి పెర‌గుతూ పోతుంది. సామాన్యులు, సెల‌బ్రిటీలు అనే తేడా లేకుండా కరోనా మ‌హ‌మ్మారి ప్ర‌తి ఒక్క‌రిపై త‌న ప్ర‌తాపం చూపిస్తుంది. ఇప్ప‌టికే క‌రోనా వ‌ల‌న ప‌లువురు న‌టులు, సింగ‌ర్స్ మృత్యువాత ప‌డ‌గా, తాజాగా స్టార్ వార్స్ యాక్ట‌ర్ ఆండ్రూ జాక్(76) కరోనా బారిన ప‌డి క‌న్నుమూశారు. రెండు రోజుల క్రితం క‌రోనా సోకింద‌నే విష‌యాన్ని తెలుసుకున్న ఆయ‌న ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ మార్చి 31న మృత్యువాత ప‌డ్డారు.

జాక్ భార్య గేబ్రియల్‌ రోజర్స్ ప్ర‌స్తుతం క్వారంటైన్‌లో ఉండ‌గా, త‌న భ‌ర్త మృతిపై సోష‌ల్ మీడియా ద్వారా స్పందించింది. రెండు రోజుల క్రితం జాక్‌కి క‌రోనా సోకింది. ఎలాంటి బాధ లేకుండా ఆయ‌న క‌న్నుమూశారు. ఆయ‌న మృతితో నా గుండె ప‌గిలింది అని గేబ్రియ‌ల్ అన్నారు. స్టార్‌ వార్స్‌ ఎపిసోడ్‌ 7,8లలో తన నటనతో ప్రేక్షకులని ఆక‌ట్టుకున్న ఆండ్రూ జాక్  ప్రముఖ నటులు రాబర్ట్‌ డౌనీ జూనియర్‌, క్రిస్ హేమ్స్‌వర్త్‌లకు భాష నేర్పించే కోచ్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. 


logo